ఎం.ఎం కీరవాణి భార్య ఏం చేస్తారో తెలిస్తే అవాక్కవుతారు..

ప్రముఖ దర్శకుడు రాజమౌళి గురించిమాట్లాడాలంటే మొదటిగా ఆయన ఫ్యామిలీ గురించే చెప్పుకుంటారు. అయితే ఇప్పటి వరకు రాజమౌళి ఫ్యామిలీ సభ్యుల్లో ఆయన సతీమణి రమా రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, ఆయన కుమారుడు కాలభైరవ గురించి ఎక్కువగా వింటుంటాం. కానీ ఈ టీమ్‌లో శ్రీవల్లి అనే ఆవిడ కూడా కొన్ని సినిమాల్లో కీలక పాత్ర పోసిస్తున్నారనే విషయం చాలా మందికి తెలియదు. అయితే శ్రీవల్లి ఎవరో కాదు ఎం.ఎం. కీరవాణి సతీమణి, రమా రాజమౌళికి స్వయానా చెల్లి.

1989 ఆగస్టు 23న శ్రీవల్లి, కీరవాణిల వివాహం జరిగింది. ఆ సమయంలో కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ కె. చక్రవర్తి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసేవారు. ఆ సమయంలో రాజమౌళి ఇంకా చదువుకుంటున్నారు. అయితే కీరవాణి తనకు వచ్చిన రూ.200 లతో కుటుంబాన్ని పోషించేవారట. ఈ సమయంలో శ్రీవల్లి ఆ డబ్బుతోనే ఇల్లు చక్కబెట్టేదట. ఇంట్లో వాళ్లందరినీ ఏమాత్రం కసురుకోకుండా అందరినీ ఆప్యాయతతో చూసేవారట. అందుకే కుటుంబసభ్యులంతా ఇప్పటికి
కలిసే ఉంటున్నారు. ప్రస్తుతం రాజమౌళి గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. కానీ ఒకప్పుడు ఆయనను ఎవరు నమ్మలేదట. ఆ సమయం లో ఆయన ప్రతిభను గుర్తించింది శ్రీవల్లినే అని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాకుండా ఆమెను వల్లమ్మ అని పిలుస్తుంటారట రాజమౌళి.

అప్పుడప్పుడు శ్రీవల్లిని కలవడానికి వెళ్లిన రమాకి రాజమౌళితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి, పెద్దల ఇష్టంతో పెళ్లి చేసుకున్నారు. రాజమౌళి, రమా పిల్లలను కూడా శ్రీవల్లి క్రమశిక్షణతో పెంచారు. ఆమె క్రమశిక్షణ విషయంలో ఎక్కడా రాజీపడేవారు కాదట. ఇక శ్రీవల్లి, కీరవాణిలకు ఇద్దరు కుమారులు. వారిలో ఒకరు కాలభైరవ , రెండవవారు శ్రీ సింహ . శ్రీవల్లి ప్రస్తుతం రాజమౌళి సినిమాలకు లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఒక సినిమా నిర్మాణంలో లైన్ ప్రొడ్యూసర్ పాత్ర ఎంతో ఉంటుంది. శ్రీవల్లి ఈగ సినిమా నుంచి లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆ తరువాత బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలకు పనిచేశారు. ఇలా శ్రీవల్లి రాజమౌళి సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.