ఈ డైరెక్టర్ మామూలోడు కాదు.. ఆస్కార్స్‌లో ఏకంగా 13 సార్లు నామినేట్!

ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ చిత్రాలకు పట్టం కట్టెందుకు ఆస్కార్ సిద్ధమవుతుంది. మార్చి 13వ తేదీ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్, సైన్సెస్ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది మన టాలీవుడ్ తరుఫున RRR సినిమా కూడా నామినేట్ కావడంతో భారతీయుల దృష్టంతా అకాడమీ అవార్డులపై పడింది. అయితే ఈ సారి ప్రపంచ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ అరుదైన ఘనతను, రికార్డును సాధించేందుకు సిద్దమవుతున్నారు. ఇక ఆ వివరలోకి వెళ్ళితే..

స్టీవెన్ స్పీల్ బర్గ్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు 13 సార్లు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యారు. 1978 నుంచి ఇప్పటి వరకు బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పిక్చర్ కేటగిరీలో నామినేట్ అవుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఏడాది తాను రూపొందించిన ది ఫేబెల్ మ్యాన్స్ అనే చిత్రానికి బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే క్యాటగిరిలో నామినేషన్ సాధించారు. 1978 నుంచి ఇప్పటి వరకు ఆయన ఆస్కార్ నామినేషన్ సాధించడం 14వ సారి. 1978లో క్లోజ్ ఎన్‌కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్, 1982లో రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్, 1983లో ఈటీ: ది ఎక్ట్రా టెర్రెస్టిరియల్, 1986లో ది కలర్ పర్పల్, 1994లో షిండ్లర్స్ లిస్ట్, 199లో సేవింగ్ ప్రైవేట్ ర్యాన్, 2006లో మ్యూనిచ్, 2007లో లెటర్స్ ఫ్రమ్ ఐవో జిమా, 2012లో వార్ హార్స్, 2013లో లింకన్, 2016లో బ్రిడ్జ్ ఆఫ్ స్పీసెస్, 2018లో ది పోస్ట్, 2022లో వెస్ట్ సైడ్ స్టోరి చిత్రాలకు నామినేషన్ సాధించాడు.

అయితే స్టీవెన్ స్పీల్ బర్గ్ 13 సార్లు ఆస్కార్ కు నామినేట్ అయితే మూడుసార్లు అస్కార్ అవార్డులను సొంతం చేసుకొన్నారు. 1984లో షిండ్లర్స్ లిస్ట్ చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్ అవార్డును సొంతం చేసుకున్నారు. 1999లో ఉత్తమ దర్శకుడిగా సేవింగ్ ప్రైవేట్ ర్యాన్ సినిమాకు అవార్డును సొంతం చేసుకొన్నారు. ప్రస్తుతం అంటే 2023లో ది ఫెబెల్ మాన్స్ అనే చిత్రానికి ఆస్కార్ నామినేషన్ సాధించాడు. బెస్ట్ పిక్చర్స్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే క్యాటగిరిలో అర్హత సాధించాడు. అయితే ఇప్పుడు మాత్రం అతను ఏ అవార్డును గెలుచుకొంటాడనే ఆతృత స్టీవెన్ స్పీల్ బర్గ్ అభిమానుల్లో ఎక్కువగా ఉంది.

అంతేకాకుండా ఆస్కార్ అవార్డులో మరో విశేషమైన విషయం కూడా ఉంది. 13 సార్లు మరో ఫిల్మ్ మేకర్ కూడా నామినేట్ అయిన విలియమ్ వైలెర్‌తో స్పీల్ బర్గ్‌తో పోటీ పడుతున్నాడు. విలియమ్ వైలేర్ 1942లో మిస్ మినివర్, 1946లో ది బెస్ట్ ఇయర్స్ ఆఫ్ అవర్ లైవ్స్, 1959లో బెన్ హర్ సినిమాలకు ఆస్కార్ సాధించారు.విలియమ్ వైలెర్ తన 79వ ఏట అంటే 1981లో కన్నుమూశారు. ఇద్దరికి మూడుసార్లు ఆస్కార్ అవార్డు లభించింది. ఈ సారి విలియమ్ రికార్డును అధిగమించి స్పీల్ బర్గ్ రికార్డు సాధిస్తారా? అనే విషయం ఆసక్తిగా నిలిచింది.

Share post:

Latest