అప్పట్లో హేళన..ఇప్పట్లో రాజయోగం శోభిత ధూళిపాళ్ల కామెంట్స్..!!

టాలీవుడ్ లో గూఢచారి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది హీరోయిన్ శోభిత దూళిపాళ్ల.. ఇక ఈ మధ్యకాలంలో నాగచైతన్య విషయంలో ఎన్నోసార్లు వైరల్ గా మారుతూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా నాగచైతన్యతో లవ్ లో ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.కానీ ఇప్పటివరకు ఈ విషయంపై ఎవరూ అధికారికంగా స్పందించలేదు.

Entertainment News | The Indian Express

డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ చిత్రం ద్వారా పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ,తమిళ్ ,హిందీ వంటి చిత్రాలలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్లో నటించింది. ఈ సిరీస్ ప్రచార కార్యక్రమం లో భాగంగా తన జీవితంలో ఎదురైన కొన్ని చేదు సంఘటనలను తెలియజేసింది. ఒకప్పుడు అందంగా ఆకర్షణీయంగా లేనని కొంతమంది బ్రాండ్ తనను బ్యాగ్రౌండ్ మోడల్ గా కూడా సెలెక్ట్ చేయలేదని కానీ మూడేళ్ల తర్వాత అదే బ్రాండ్ కు తాను బ్రాండ్ అంబాసిడర్ గా సంతకం చేసినట్లుగా అప్పటి రోజులను గుర్తు చేసుకోవడం జరిగింది శోభిత ధూళిపాళ్ల.

శోభిత ధూళిపాళ్ల మాట్లాడుతూ.. నేను అందంగా ఆకర్షణీయంగా లేనని తనని కేవలం బ్యాగ్రౌండ్ మోడల్ గా కూడా సెలెక్ట్ చేయలేదు.కానీ మూడేళ్ల తర్వాత అదే బ్రాండ్ కి సైన్ చేశాను.. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ బచ్చన్ తో షాంప్స్ యాడ్ చేస్తున్నాను చాలా సంతోషంగా ఉందంటూ తెలియజేసింది. శోభిత నటించిన ది నైట్ మేనేజర్ అనే ఒక క్రైమ్ డ్రామా చిత్రంలో కావేరి పాత్రలు నటించబోతోంది ఈ వెబ్ సిరీస్ గత నెల 17వ తేదీన డిస్నీ ప్లస్ ఆడుస్టార్లు స్ట్రిమింగ్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Sobhita Dhulipala (@sobhitad)

Share post:

Latest