అప్పుడు కష్టాలు.. ఇప్పుడు లగ్జరీ లైఫ్.. కమెడియన్ రఘు ఇల్లు చూశారా..?

కమెడియన్ రఘు కారుమంచి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ఇటీవలే తన నటనకు బ్రేకు ఇచ్చిన రఘు గతంలో.. అదుర్స్ ,లక్ష్మి, నాయక్, ఊసరవెల్లి వంటి చిత్రాలలో తన కామెడీతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. వెండితెర పైన కూడా కమెడియన్ గా మంచి పేరు సంపాదించిన రఘు దాదాపుగా వందకు పైగా చిత్రాలలో నటించారు. వాస్తవానికి 20 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆది సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన రఘు పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా కూడా పరిచయమయ్యారు.

అయితే కొన్ని కారణాల చేత బుల్లితెరకు సైతం గుడ్ బై చెప్పిన రఘు సినీ ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చేసారు. ప్రస్తుతం సాధారణ వ్యక్తిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు లాక్ డౌన్ సమయంలో చాలా ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు.

దీంతో వైన్ షాప్ లో కూడా పని చేస్తున్నట్లు పలు ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. అలా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న రఘు కొద్ది కాలంలోనే ఒక లగ్జరీ ఇంటికి కూడా ఓనర్ అయ్యారని తెలుస్తోంది. రఘు తన స్నేహితుడి వల్లే రెండు బెల్ట్ షాపులకు ఓనర్ అయినట్లుగా తెలుస్తోంది.

వ్యాపారంతో మళ్లీ పుంజుకున్న రఘు తన అభిరుచికి తగ్గట్టుగానే లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నట్లు సమాచారం. స్టార్ హీరోల ఇళ్లకు ఏ మాత్రం తీసుకోకుండా తన సొంతింటి కలను నిజం చేసుకున్నారు. ఇప్పటికీ రఘు సినీ ఎంట్రీ ఇస్తే చూడాలని అభిమానుల సైతం కోరుకుంటున్నారు. రఘు లగ్జరీ ఇల్లును చూసి పలువురు నేటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. రఘు కోరుకున్న సొంతింటి కల నిజం చేసుకున్నారని చెప్పవచ్చు. రఘు ఇంటికి సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest