ఆ కారణంగానే హీరోయిన్లను పెళ్లి చేసుకోరు..కృతి సనన్

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగు పెట్టాలని అందరూ అనుకుంటూ ఉంటారు.అలా ఇప్పటివరకు చాలామంది ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే అమ్మాయిలు చెడిపోతారని అభిప్రాయం చాలా మందిలో ఉన్నది.అందుకే తమ కూతుర్లని సైతం హీరోయిన్లు చేయడానికి ఎక్కువగా ఎవరు ఇష్టపడరు. ఈ భావన రెండు దశాబ్దాల క్రితం అయితే చాలా బలంగా ఉండేది. అందుకే తెలుగు అమ్మాయిలు ఎవరు కూడా హీరోయిన్స్ గా ఎదగలేకపోయారు. ఇక ఈ మధ్యకాలంలో నటన అనేది ఒక వృత్తి అని నటిగా రాణించడం అనేది వృత్తిలో ఒక భాగంగా భావిస్తున్నారు.

అయితే ఇప్పటికే సమాజంలో చాలా ప్రాంతాలలో సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటుల మీద పలు అభిప్రాయాలు ఉంటాయని చెప్పవచ్చు. ఈ విషయంపై హీరోయిన్ కృతి సనన్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి అంత వేగంగా వివాహాలు కావు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. వాస్తవానికి చాలామంది హీరోయిన్స్ ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు కూడా. ఇందుకు కారణం హీరోయిన్స్ అంటే ఒక ఉద్యోగం అనే విషయాన్ని చాలామంది ఇప్పటికీ అంగీకరించలేరు..

అలాగే ఇండస్ట్రీలో నటిగా పనిచేయడం ఒక వృత్తిగా చూడరు ఈ కారణంగానే హీరోయిన్స్ ని పెళ్లి కావడం చాలా కష్టము.. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్త లు చాలామంది తనని ఇలాగే భయపెట్టారు. అయితే ఆ విషయాలన్నీ తాను సీరియస్గా తీసుకోలేదని ఇండస్ట్రీ వృత్తిలో సక్సెస్ కావాలని భావించే హీరోయిన్గా తన కెరీర్ ని మొదలు పెట్టానని తెలుపుతోంది. ప్రస్తుతం ప్రభాస్ నటించిన ఆది పురుష్ చిత్రంలో హీరోయిన్గా నటించిన మరొకవైపు షాహిద్ కపూర్ సినిమాలో కూడా నటిస్తున్నది.

Share post:

Latest