పవన్‌పై బీభత్సమైన ట్రోలింగ్.. కూతురు వయసున్న శ్రీలీలతో రొమాన్స్ ఎలా చేస్తావోయ్‌ అంటూ!!

ప్రస్తుతం ఏ ఇండస్ట్రీలో చూసినా ముసలి హీరో, కుర్ర హీరోయిన్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఇలాంటి కాంబినేషన్స్ ఎక్కువగా బాలీవుడ్‌లో చూస్తుంటాం కానీ ఇప్పుడు టాలీవుడ్‌లోనూ ఈ కాంబోలు ఎక్కువగానే రిపీట్ అవుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు సీనియర్ హీరో, జూనియర్ హీరోయిన్ కాంబోలో కనిపించబోతున్న నటీనటులు ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రీలీల. డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ‘ఓజీ’ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన ఓకే చేసిన ప్రాజెక్ట్స్ అన్ని షూటింగ్ మొదలుపెట్టె దిశలో ఉన్నాయి. వాటిలో ఒకటైన ‘వినోదాయ చిత్తాం’ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలుపెట్టారు. తొందర్లోనే డైరెక్టర్ సుజిత్, డీవివి ధనయ్య ల సినిమా షూటింగ్ స్టార్ చేయబోతున్నారు. వీరు దర్శకత్వం వహిస్తున్న సినిమాకి పవన్ కేవలం 20 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చాడని టాక్. దాంతో సుజిత్ కాస్ట్ అండ్ క్రూ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. దాంట్లో భాగంగా శ్రీలీల పేరు విపడుతుందట. అయితే పవన్ కి శ్రీలీల కి మధ్య చాలా గ్యాప్ ఉంది అని లెక్కలేస్తున్నారట .

ఈ విషయంపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి కొన్ని విమర్శలు వెలువెత్తుతున్నాయి. పవన్‌కి 51 ఏళ్లు ఉంటే శ్రీలీలకి కేవలం 21కెళ్లే ఉన్నాయని, వీరి మధ్య 30 ఏళ్ల గ్యాప్ ఉందని, ఆమె పవన్‌కి కూతురు వయస్సు అవుతుందని, అలాంటి అమ్మాయితో ఎలా రొమాన్స్ చేస్తాడని చాలామంది బీభత్సంగా ట్రోలింగ్ మొదలుపెట్టారు.

అసలు హీరో హీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ ఉన్న సినిమా రావడం ఇదేం మొదటిసారా? అంటే కానే కాదు. ఇంతకు ముందు వరకు ఇలాంటి కాంబినేషన్లు చాలా వచ్చాయని సీనియర్ హీరో, జూనియర్ హీరోయిన్ కాంబినేషన్‌లో వచ్చిన పేర్లను గుర్తు చేస్తున్నారు కొందరు. అంతెందుకు ధమాకా సినిమాలో శ్రీలిల, రవితేజ జోడిది మాత్రం పెద్ద వయసే కదా అని అడుగుతున్నారు పవన్ ఫ్యాన్స్.

అయితే ఏజ్ గ్యాప్ గురించి పక్కన పెడితే, దర్శకుడు హీరో ని చాలా యంగ్ గా చూపించడానికి ప్రయత్నించడం చాలా అవసరం. అలా చేస్తే హీరో వయసు పెద్దగా కనపడదు. ధమాకా సినిమా రవితేజ చాలా యంగ్‌గా కనిపించాడు. అలానే నటించాడు కూడా. అలానే ఇప్పుడు ఓజీ సినిమాలో పవన్ ని డైరెక్టర్ ఎలా చూపిస్తారని అంత అనుకుంటున్నారు.

Share post:

Latest