పుష్ప సినిమాలో హైలైట్ అయిన దాన్నే పుష్ప 2లో తీసేస్తున్న సుకుమార్.. మూవీ అట్టర్ ఫ్లాపే??

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు ( ఏప్రిల్ 8) సందర్భంగా ఫ్యాన్స్‌ కోసం టీజర్‌ను విడుదల చేయాలని “పుష్ప 2” నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ పూర్తి చేస్తున్నాడు. ఫహద్ ఫాసిల్ వంటి వారితో పార్ట్ 2 సినిమాకు సంబంధించిన షెడ్యూల్‌ను చక చకా పూర్తి చేస్తున్నాడు. అయితే ఈసారి షూటింగ్ కోసం టీమ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బ్యాంకాక్ లేదా దక్షిణాఫ్రికాలోని ఏ అడవికి వెళ్లడం లేదు. దీంతో అభిమానులంతా షాక్ అవుతున్నారు.

నిజానికి ఈ బృందం కొన్ని ఇతర రాష్ట్రాల అడవులకు వెళ్లినా కొద్దికాలం మాత్రమే ఉంటుంది. దీని వెనుక కారణం ఏమిటంటే, పుష్ప 2లో రియల్ టైమ్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌ను అనుకరించే చాలా కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ ఉంటుంది. చిత్ర నిర్మాతలు ప్రస్తుతం షూటింగ్ కోసం అల్లు స్టూడియోస్, ఇతర ప్రదేశాలలో దాదాపు 10-11 సెటప్‌లను నిర్మించారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఈ లొకేషన్‌లన్నింటికీ డిజిటల్ ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి. సినిమా చాలా వరకు ఈ లొకేషన్లలోనే జరుగుతుంది. అయితే ఈ ఆర్టిఫిషియల్ అడవులలో తీసే సన్నివేశాలు ప్రేక్షకులకు రుచించకపోవచ్చు. మొదటి సినిమాలో రియల్ ఫారెస్ట్ సన్నివేశాలే బాగా హైలైట్ అయ్యాయి. ఇప్పుడు ఆ రియల్ ఫారెస్ట్ లేకుండా తీస్తుండటం చాలామందిని నివ్వెరపరుస్తోంది.

కాగా సుకుమార్ ప్రతి సన్నివేశాన్ని కొన్ని ప్రత్యేకమైన వివరాలతో మరింత రియలెస్టిక్‌గా తీర్చిదిద్దాలని భావిస్తున్నాడు. కానీ మారేడుమిల్లి వంటి రియల్ లొకేషన్‌లకు వెళ్లి ఆర్టిస్టులను ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా సెట్‌లు నిర్మించి సీజీ వర్క్‌తో సరిపెట్టాలని అనుకున్నాడు. మరి ఓవరాల్ అవుట్ పుట్ ఎలా ఉంటుందో సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వేచి చూడక తప్పదు.