`రైటర్ పద్మభూషణ్` దెబ్బ‌కు భారీగా పెంచేసిన సుహాస్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?

యంగ్ అండ్ టాలెంట్ హీరో సుహాస్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సుహాస్‌.. `కలర్ ఫోటో` మూవీతో హీరోగా మారాడు. తొలి సినిమాతోనే సూప‌ర్ డూప‌ర్ హిట్ ను అందుకోవ‌డ‌మే కాదు నేషనల్ అవార్డును అందుకున్నాడు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ప‌లు సినిమాల్లో స‌హాయ‌క పాత్ర‌ల‌ను పోషించిన సుహాస్.. గ‌త ఏడాది విడుద‌లైన `హిట్ 2` లో విల‌న్ గా అద‌ర‌గొట్టేశాడు.

రీసెంట్ గా సుహాస్ హీరోగా న‌టించిన రెండో చిత్రం `రైటర్ పద్మభూషణ్` ప్రేక్ష‌కుల ముందుకు మంచి ఆద‌ర‌ణ‌ను సొంతం చేసుకుంది. షణ్ముఖ ప్రశాంత్‌ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో టీనా శిల్పారాజ్ హీరోయిన్ గా చేసింది. థియేటర్లలో ఫిబ్రవరి 3న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా సుహాస్ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. చిన్న సినిమాగా రిలీజయిన రైటర్ పద్మభూషణ్ పెద్ద హిట్ గా నిలిచింది.

`రైటర్ పద్మభూషణ్` దెబ్బ‌కు సుహాస్ త‌న రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచేశాడ‌ట‌. ఈ సినిమా హిట్ తర్వాత సుహాస్ ఫుల్ బిజీ అయ్యిపోయాడు. ఆయన వరస సినిమాలు కమిట్ అవుతున్నాడు. అదే సమయంలో ఒక్కో సినిమాకు రూ. కోటిన్న‌ర నుంచి రెండు కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడ‌ట‌. ఏదేమైనా మ‌ల్టీ టాలెంటెడ్ అయిన సుహాస్ ఆ మాత్రం డిమాండ్ చేయ‌డంలో ఏ మాత్రం త‌ప్పు లేద‌నే అంటున్నారు సినీ ప్రియులు.

Share post:

Latest