ఆస్కార్ మొత్తానికి హైలైట్‌గా నిలిచిన ఏకైక నటి.. ఎవరో తెలిస్తే..

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకుణే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్‌లో ఈ అమ్మడుకి మంచి క్రేజ్ ఉంది. నటనతో పాటు తన అందమైన గ్లామర్ తో అందరిని ఆకట్టుకుంటుంది. ఆమె అందానికి తగ్గ దుస్తులను డిజైన్ చేస్తుంటారు పాపులర్ డిజైనర్స్. రకరకాల మోడ్రెన్ దుస్తులో మెరిసిపోతూ కనపడుతుంది దీపికా.

తాజాగా జరిగిన ఆస్కార్ వేడుకలో ఈ ముద్దుగుమ్మ ఎంతో అట్రాక్టివ్‌గా కనపడింది. ఆ వేడుకలో దీపికా ఎరుపు రంగు స్ట్రాఫీ డిజైనర్ డ్రస్ ధరించి తలుక్కున మెరిసింది. ఆమె అందం అక్కడ హైలెట్ గా నిలిచింది. అక్కడ ఉన్న చాలా మంది దీపికాని చూసి “వావ్, ఇంత బాగుంది ఏంటి.. ఎవరీ అందాల బొమ్మ” అని కామెంట్స్ చేసారు. ఈ బ్యూటీ అందమైన డిజైనర్ డ్రెస్ వేసుకొని క్యాట్ వాక్ చేస్తుంటే అక్కడ ఉన్నవాళ్లంతా దీపిక వైపు నుండి కళ్ళు తిప్పుకోలేకపోయారు. అంతేకాకుండా ఆమెని చూసి దారి తప్పి వచ్చిన నిప్పు కోడి రాంప్ వాక్ చేస్తున్నట్లు ఉందని కామెంట్ చేసారు.

ఈ ముద్దుగుమ్మ తన నెక్స్ట్ సినిమా టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ సరసన ‘ప్రాజెక్ట్ కే’ లో నటించనుంది. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కబోతుంది. ఆ తరువాత హృతిక్ రోషన్ సరసన ‘ఫైటర్’ సినిమాలో నటిస్తుంది. అంతేకాకుండా షారుఖ్ ఖాన్ నటించిన బ్రహ్మస్త్ర 2లో గెస్ట్ రోల్ లో కనిపించబోతుంది. ప్రస్తుతం ఆస్కార్ వేడుకలో ఈ ముద్దు గుమ్మకి సంబంధించిన అందమైన ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఏది ఏమైనా ఈ ముద్దుగుమ్మ అందానికి పోటీ లేరు అనే చెప్పాలి.

Share post:

Latest