`శాకుంతలం` మ‌ళ్లీ వాయిదా.. లబోదిబోమంటున్న స‌మంత ఫ్యాన్స్‌!?

స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో గుణశేఖర్ దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం `శాకుంత‌లం`. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు. పౌరాణిక నేప‌థ్యంలో అద్భుత‌మైన ప్రేమ కావ్యంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శకుంత‌ల‌గా స‌మంత‌, దుష్యంత మ‌హారాజుగా దేవ్ మోహ‌న్ న‌టించారు.

మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు. విజువ‌ల్ వండ‌ర్‌గా త్రీడీ టెక్నాల‌జీతో తెలుగు, హిందీ, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో శాకుంత‌లం సినిమా విడుద‌ల కానుంది. మొద‌ట ఈ చిత్రాన్ని గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల చేయాల‌ని భావించారు. కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల 2023 ఫిబ్ర‌వ‌రి 17కు వాయిదా వేశారు. అయితే ఆ తేదీకి కూడా సినిమా రాలేదు.

ఈ ఎపిక్ ల‌వ్ స్టోరి ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ఇటీవ‌ల మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. శాకుంత‌లం మ‌ళ్లీ వాయిదా ప‌డ‌నుందంటూ ప్ర‌చారం ఊపందుకుంది. తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలంటే కాస్త సేఫ్‌ టైమ్‌ ను చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ, ఏప్రిల్ లో తెలుగుతో పాటు త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో ఇతర సినిమాలు విడుద‌ల‌కు రెడీ అయ్యాయి. ఈ నేప‌థ్యంలోనే శాకుంత‌లంను ఏప్రిల్ 14న కాకుండా మ‌రో సేఫ్ డేట్ లో తీసుకురావాల‌ని భావిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో శాకుంత‌లం మ‌ళ్లీ వాయిదా ప‌డ‌నుందా అంటూ ఫ్యాన్స్ ల‌బోదిబోమంటున్నారు.

Share post:

Latest