నీపై ఇష్టాన్ని మాట‌ల్లో చెప్ప‌లేను.. హాట్ టాపిక్ గా మారిన స‌మంత తాజా పోస్ట్!

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత కొద్ది నెలల క్రితం నాగచైతన్య నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 7 ఏళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట పెళ్లి తర్వాత కనీసం నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న సమంత కెరీర్ ప‌రంగా య‌మా జోరు చూపిస్తోంది.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతోంది. అయితే విడాకుల తర్వాత సమంత ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ అవుతుంది. నెట్టింట హాట‌ఖ‌ టాపిక్ గా మారుతుంది. తాజాగా కూడా అదే జరిగింది. `ప్రతి ఒక్కరి జీవితంలో నీలాంటి ఫ్రెండ్ అవసరం. ఎప్పుడూ బాధలు, కష్టాలు దరిచేరనివ్వరు. దుఃఖంలోనూ నవ్విస్తూంటావ్. ఈ జీవితంలో నువ్వులేకపోతే నేనేం చేయలేగలను. నీపై ఇష్టాన్ని మాట‌ల్లో చెప్ప‌లేను. హ్యాపీ బర్త్ డే` అంటూ స‌మంత తాజాగా ఓ పోస్ట్ పెట్టింది.

త‌న‌ ఫ్రెండ్, ఫిల్మ్ డైరెక్టర్, స్కీన్ రైటర్ నందిని రెడ్డి కోసం స‌మంత ఈ పోస్ట్ పెట్టింది. ఈ రోజు నంద‌ని రెడ్డి బ‌ర్త్‌డే. ఈ నేప‌థ్యంలోనే సామ్ ఎంతో స్వీట్ అండ్ క్యూట్ గా ఆమెకు బ‌ర్త్‌డే విషెస్ తెలిపింది. కాగా, సమంత – నందినీ రెడ్డి కాంబోలో ‘జబర్దస్త్’ అనే చిత్రం వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే హీరో సిద్ధార్థ్ తో సమంత ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లకు విడిపోయారు. ఆ సమయంలో నందినీ రెడ్డినే సమంతకు ధైర్యానిచ్చి మ‌ళ్లీ కెరీర్ పై దృష్టి పెట్టేలా చేసింద‌ని ఇన్‌సైడ్ టాక్ ఉంది.

Share post:

Latest