స్టేజిపై `నాటు నాటు` స్టెప్పులు మర్చిపోయిన చరణ్.. పరువు మొత్తం తీసేశాడుగా!

ప్ర‌స్తుతం ప్ర‌పంచం మొత్తం `ఆర్ఆర్ఆర్‌` సినిమాలోని `నాటు నాటు` పాట మారుమోగిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ఈ సాంగ్ ఏకంగా ఆస్కార్ అవార్డునే కొల్ల‌గొట్టింది. ఎన్నో ఏళ్ల నుంచి ఇండియాకు అంద‌ని ద్రాక్ష‌గా మారిన ఆస్కార్‌ను ఆర్ఆర్ఆర్ సాధించింది చ‌రిత్ర సృష్టించింది. దీంతో ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా నాటు నాటు పాట‌కు కాలు క‌దుపుతున్నారు.

ఈ పాట కోసం రాజ‌మౌళి, కీర‌వాణి, చంద్రబోస్‌, రాహుల్‌, కాలభైరవ ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్ ఎంత క‌ష్ట‌ప‌డ్డారో.. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ కూడా అంతే క‌ష్ట‌ప‌డ్డారు. త‌మ ఎన‌ర్జిటిక్ డ్యాన్స్ తో ఈ పాట‌ను మ‌రోస్థాయికి తీసుకెళ్లారు. మెరుపు వేగంతో వీరు వేసిన స్టెప్పులు అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. అటువంటి స్టెప్పుల‌ను మ‌ర‌చి స్టైజిపై ప‌రువు మొత్తం తీసేశాడు రామ్ చ‌ర‌ణ్‌. అస‌లేం జ‌రిగిందంటే.. ‘ఇండియా టుడే కాంక్లేవ్’ మీటింగ్ లో పాల్గొనేందుకు ఆహ్వానం దక్క‌డంతో ఆస్కార్ ఈవెంట్ అనంత‌రం రామ్ చ‌ర‌ణ్ నేరుగా ఢిల్లీకి వెళ్లిన విష‌యం తెలిసిందే.

ఈ కార్య‌క్ర‌మంలో రామ్ చ‌ర‌ణ్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకున్నాడు. అయితే కార్య‌క్ర‌మం అయిపోయిన త‌ర్వాత హోస్ట్‌ ‘నాటు నాటు’ పాటలోని హుక్ స్టెప్ ని వేయాల్సిందిగా కోరారు. అందుకు మొద‌ట చ‌ర‌ణ్ అంగీక‌రించ‌లేదు. `నాకు స్టెప్పు గుర్తు లేదు. ఇలాంటి వేదికల మీద అసలు వెయ్యలేను` అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ‘వెయ్యాలి వెయ్యాలి’ అంటూ అక్కడ అన్నవాళ్ళందరూ పట్టుబట్టడం తో ‘నాటు నాటు’ పాటకి స్టెప్పులు వెయ్యాల్సి వచ్చింది. కానీ స్టెప్పులు మర్చిపోవ‌డంతో వేసిన స్టెప్పునే మ‌ళ్లీ వేసి కార్య‌క్ర‌మాన్ని ముగించాడు. అయితే ఆస్కార్ అందున్న నాటు నాటు పాట స్టెప్పులు మ‌ర‌చిపోవ‌డం ప‌ట్ల రామ్ చ‌ర‌న్‌పై కొంద‌రు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

Share post:

Latest