పేర్నిని టార్గెట్ చేసిన జనసేన..టీడీపీకి సపోర్ట్!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని ఎక్కువ తిట్టే వైసీపీ నాయకుల్లో మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఒకరు అని చెప్పవచ్చు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన నాని..పవన్ కోసమే పెడతారు. గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు కూడా తన శాఖకు సంబంధించిన వివరాలని మీడియాకు చెప్పడం కంటే…పవన్‌ని ఎక్కువ తిట్టడంపైనే పేర్ని ఫోకస్ పెట్టేవారు. ఇక పవన్ సైతం అప్పుడప్పుడు పేర్ని టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

అలా పవన్-పేర్నిల మధ్య రాజకీయ శతృత్వం మొదలైంది..పైగా ఇద్దరు కాపు వర్గానికి చెందినవారే. అయితే అలా రాజకీయంగా శతృత్వంతో ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో నెక్స్ట్ ఎన్నికల్లో మచిలీపట్నంలో పేర్నికి చెక్ పెట్టాలని జనసేన చూస్తుంది. కానీ సింగిల్ గా పేర్నికి చెక్ పెట్టడం కష్టం. ఎందుకంటే అక్కడ జనసేనకు ఉన్న ఓట్లు గట్టిగా చూసుకుంటే 20 వేలు-30 వేలు వరకే ఉంటాయి. ఈ ఓట్లతో గెలిచేది లేదు. అయితే ఇక్కడ పార్టీ బలాన్ని మరింత పెంచాలని పవన్ చూస్తున్నారు.

ఇదే సమయంలో మార్చి 14 జనసేన ఆవిర్భావ సభని మచిలీపట్నంలో ప్లాన్ చేశారు. ఈ ఆవిర్భావ సభ వేదికగా పవన్..పేర్నిని ఎలా టార్గెట్ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. కాకపోతే ఎంత అనుకున్న జనసేనకు సింగిల్ గా పేర్నికి చెక్ పెట్టడం కష్టం. టీడీపీతో కలిస్తేనే పేర్నిని నిలువరించడం సాధ్యపడుతుంది.

పొత్తు ఉంటే మచిలీపట్నం సీటు మాత్రం జనసేనకు దక్కే అవకాశాలు పెద్దగా లేవు. ఎందుకంటే అక్కడ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు..ఆయనని కాదని జనసేనకు సీటు ఇవ్వడం జరిగే పని కాదు. ఏదేమైనా జనసేన టీడీపీకి సపోర్ట్ ఇచ్చే పేర్నికి చెక్ పెట్టాల్సి ఉంటుంది.

Share post:

Latest