క‌న్న‌డ హీరోల‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్షమాపణ.. అస‌లేం జ‌రిగిందంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా క‌న్న‌డ స్టార్ హీరోలైన ఉపేంద్ర, కిచ్చా సుదీప్ లకు క్షమాపణ చెప్పారు. అస‌లేం జ‌రిగిందంటే.. ఉపేంద్ర‌, కిచ్చా సుదీప్ క‌లిసి న‌టించిన `క‌బ్జా` మూవీ త్వ‌రలోనే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. పాన్ ఇండియా లెవెల్లో మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రానికి ఆర్ చంద్రు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

తాజాగా కర్ణాటక లో ఈ మూవీ ఆడియో ఫంక్షన్ ను అట్ట‌హాసంగా నిర్వ‌హించారు. ఈ ఈవెంట్ కు స్పెష‌ల్ గెస్ట్ గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఆహ్వానించారు. కానీ, ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో బిజీగా ఉండ‌టం వ‌ల్ల ప‌వ‌న్ క‌బ్జా ఆడియో ఫంక్ష‌న్ కు హాజ‌రు కాలేక‌పోయారు. ఈ నేప‌థ్యంలోనే కన్నడ స్టార్ హీరోలు ఉపేంద్ర, కిచ్చా సుదీప్ లకు జనసేనాని క్షమాపణలు చెప్పారు.

కబ్జా ఆడియో ఫంక్ష‌న్ కు ముఖ్య అతిథిగా పిలిచినందుకు టీమ్ మొత్తానికి ధన్యవాదాలు. అయితే ఈ ఆడియో ఫంక్షన్ కు తాను రాలేకపోతున్నానని.. దానికి బాధగా ఉన్నా తప్పడంలేదు.. త‌న‌ను క్ష‌మించాలంటూ పవన్ ప్రత్యేకంగా ప్రెస్ నోట్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు పవర్ స్టార్. అలాగే చిత్ర టీమ్‌కు మ‌రియు హీరోలిద్ద‌రికీ ప్ర‌త్యేక శుభాక్షాంక్ష‌లు తెలిపారు.

Share post:

Latest