Oscars 23: ఆస్కార్ అవార్డులని కొల్లగొట్టినది వీరే!

యావత్ ప్రపంచ సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలు ఎందరో సినిమా పండితుల మధ్యన అట్టహాసంగా ముగిసాయి. అన్నింటికీ మించి తెలుగు సినిమా ప్రేక్షకులు ఉత్కంఠతగా ఎదురుచూసిన RRR ‘నాటు నాటు’ పాటకి గాను ఎట్టకేలకు ఆస్కార్ అవార్డు లభించింది. అవును, ఇది తెలుగు సినిమా విజయం మాత్రమే కాదు, యావత్ ఇండియన్ సినిమా విజయం అని చెప్పుకోవాలి. అమెరికా లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్ దీనికి వేదికైంది.

 

ఈ సారి భారత్‌కు ఏకంగా 2 ఆస్కార్లు రావడం కొసమెరుపు. అవును, ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డు రాగా.. ది ఎలిఫెంట్ విస్పర్స్ అనే డాక్యూమెంటరీ షార్ట్ ఫిల్మ్‌కు పురస్కారం వచ్చింది. 2023వ సంవత్సరానికి గాను అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన నటీనటులు, సిబ్బందికి ఈ సందర్భంగా ఆస్కార్ అవార్డులు అందజేశారు. ఈ సారి ఎక్కువగా “ఎవ్రిథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్” అనే సినిమాకు అత్యధికంగా అవార్డులు రావడం గమనార్హం. ఇక ఆస్కార్ అవార్డుల్లో భారత్‌కు రెండు పురస్కారాలు లభించడమే కాకుండా.. సదరు వేడుకల్లో నాటు నాటు పాట లైవ్ ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనకు స్టాండింగ్ ఓవేషన్ దక్కడం విశేషం.

 

95వ ఆస్కార్ అవార్డుల విజేతలు వీరే…

 

ఉత్తమ చిత్రం: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్, డేనియల్ క్వాన్, డేనియల్ స్కీనెర్ట్, జోనాథన్ వాంగ్

 

బెస్ట్ యాక్టర్: బ్రెండన్ ఫ్రేజర్, దివేల్

 

బెస్ట్ యాక్ట్రెస్: మిచెల్ యోహ్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్

 

బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్: కే హుయ్ క్వాన్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్

 

బెస్ట్ యాక్ట్రెస్ సపోర్టింగ్ రోల్: జేమీ లీ కర్టిస్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్

 

బెస్ట్ డైరెక్టర్: డేనియల్ క్వాన్-డేనియల్ స్కీనెర్ట్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్

 

బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: గిల్లెర్మోడెల్ టోరోస్ పినోషియో, గిల్లెర్మోడెల్ టోరో, మార్క్ గుస్టాఫ్సన్, గ్యారి ఉంగర్, అలెక్స్ బల్కీ

 

బెస్ట్ సినిమాటోగ్రాఫర్: జేమ్స్ ఫ్రెండ్, ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్

 

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్: రూత్ కార్టర్, బ్లాక్ పాంథర్: వాకండ ఫరెవర్

 

బెస్ట్ డాక్యూమెంటరీ ఫీచర్ ఫిల్మ్: నావల్నీ

 

బెస్ట్ డాక్యూమెంటరీ షార్ట్ ఫిల్మ్: ది ఎలిఫెంట్ విస్పర్స్, కార్తిక్ గోన్సాల్వేస్, గునీత్ మోంగా

 

బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: పాల్ రోజర్స్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్

 

బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: ఆల్ క్వైట్ ది వెస్ట్రర్న్ ఫ్రంట్- జర్మనీ

 

మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: ది వేల్(ఏడ్రియన్ మోరట్, జూడీ చిన్, అనీ మేరీ బ్రాడ్లీ)

 

బెస్ట్ మ్యూజిక్ ఒరిజినల్ స్కోర్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్- వోల్కర్ బెర్టెల్మాన్(Volker Bertlmann)

 

బెస్ట్ ఒరిజినల్ సాంగ్: నాటు నాటు, సంగీతం: కీరవాణి, సాహిత్యం: చంద్రబోస్

 

బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్

 

బెస్ట్ షార్ట్ ఫిల్మ్ యానిమేటెడ్: ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్

 

బెస్ట్ షార్ట్ ఫిల్మ్ లైవ్ యాక్షన్: యాన్ ఐరిష్ గుడ్ బై

 

బెస్ట్ సౌండ్: మార్క్ వీన్ గార్టెన్, జేమ్స్ హెచ్ మాథర్, అల్ నెల్సన్, క్రిస్ బర్డన్- టాప్ గన్ మ్యావ్రిక్

 

బెస్ట్ విజువల్స్ ఎఫెక్ట్స్: అవతార్: ది వే ఆఫ్ వాటర్

 

బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: వుమెన్ టాకింగ్, సారాపోలీ స్క్రీన్ ప్లే

 

బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్