ఎన్టీఆర్ హీరోయిన్ సూసైడ్ నోట్ వైరల్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ లోకి మొదట ప్రయాణం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది హీరోయిన్ పాయల్ ఘోష్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి చిత్రం ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత మిస్టర్ రాస్కెల్ క సినిమాతో ఈ ముద్దుగుమ్మ అందచందాలతో బాగా ఆకట్టుకుంది. కానీ తెలుగులో మాత్రం అంతంతగాని అవకాశాలు దక్కించుకుంది. బాలీవుడ్ లో మాత్రం ఎక్కువగా ఫోకస్ పెట్టి పలు చిత్రాలలో నటించింది. అయితే అక్కడ కూడా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. అయితే ఎన్టీఆర్ మాత్ర ఈమెకు ఫేవరెట్ హీరో అని తెలుపుతోంది.

Actress Payal Ghosh shares unfinished suicide note, threatens to expose the  names who would be responsible for her death | Bengali Movie News - Times  of India
ఇక తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన RRR చిత్రానికి నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పై తన సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది పాయల్. ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతారని 2020 లోని చెప్పాను ఆస్కార్ విషయాన్ని ముందే అంచనా వేశాను నేనెప్పుడూ అబద్ధం చెప్పను అంటూ తన ట్విట్టర్ నుంచి షేర్ చేసింది పాయల్ ఘోష్. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ సంబంధించి ఒక సూసైడ్ నోట్ వైరల్ గా మారుతోంది .అది చూసిన అభిమానుల సైతం చాలా ఆందోళన గురవుతున్నారు.

ఈ విషయాన్ని స్వయంగా పాయలే సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం.. ఒకవేళ నాకు గుండెపోటు వచ్చి చనిపోయిన లేదా నేను ఆత్మహత్య చేసుకొని మరణించిన అందుకు కారణం ఎవరంటే అంటూ సగం రాసి ఉన్న పేజీని తన ఇంస్టాగ్రాములో షేర్ చేసింది పాయల్ ఘోష్.ఇది చూసిన అభిమానుల సైతం తెగ ఆందోళన పడుతూ ఏం జరిగిందో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Share post:

Latest