ఆ తప్పుతో మ్యూజిక్ డైరెక్టర్ అనూప్‌ కెరీర్ ముగిసినట్లే.. షాకింగ్ విషయాలు వెలుగులోకి!!

మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు ప్రేమ కావాలి, ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, మనం, టెంపర్, గోపాల గోపాల లాంటి సూపర్ హిట్ మూవీలకు మ్యూజిక్ అందించి టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌ గా ఎదిగాడు. అయితే ఇప్పుడు అనూప్ చేతిలో ప్రస్తుతం ఒక్క పెద్ద సినిమా కూడా లేదట. అసలు అనూప్ ని పెద్ద సినిమాలకి అస్సలు తీసుకోవట్లేదట.

అయితే ఈ మధ్య అనూప్ ఎక్కువగా చిన్న సినిమాలలో చాలా క్వాలిటీ మ్యూజిక్ ని అందించడం తో పెద్ద సినిమాలకి పనికిరాడని బడా సినిమా దర్శకులు అనుకుంటున్నారు. అయితే అనూప్ మాత్రం ఒక మంచి సినిమానైనా చేతికి వస్తే తన సత్తా ఎంటో నిరూపించుకొని పెద్ద సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తానని మనసులోని మాటను బయటపెట్టాడు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్, నాగార్జున లాంటి వాళ్లు అనూప్ ని బాగా ఎంకరేజ్ చేసారు. అయితే ఇండస్ట్రీలో కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు లక్ కూడా కలిసి రావాలి. అలానే మంచి సక్సెస్ ఉంటేనే ఇండస్ట్రీలో వాల్యూ ఇస్తారు.

సక్సెస్ లేకపోతే మన కింద పనిచేసేవాళ్ళు కూడా మన మాట వినరు. కాబట్టి సక్సెస్ అవ్వడానికి ఎక్కువగా ప్రయత్నించాలి. ప్రస్తుతం అనూప్ తన టాలెంట్‌ని ఉపయోగించుకొని పెద్ద సినిమా ఆఫర్స్ ని దక్కించుకోవాలని చూస్తున్నాడు. అక్కినేని కుటుంబం నటించిన మనం సినిమాకి అనూప్ అందించిన మ్యూజిక్ చూసి నాగార్జున ఎంతగానో మెచ్చుకున్నారు. ఆ తరువాత అనూప్ కి వరుస గా అవకాశాలు కూడా ఇచ్చారు. ఇక అనూప్ కి మంచి సినిమా ఎప్పుడో వస్తుందో చూడాలి.

Share post:

Latest