ఈ సెలబ్రిటీలకు మ్యారేజ్ అంటే సరదా.. ఎంతమందిని పెళ్లి చేసుకుని వదిలేసారంటే!!

పెళ్లి అనేది మానవ జీవితంలో ఒక మధురమైన ఘట్టం. అయితే ఆ పెళ్లి బంధం అనేది మాత్రం భార్య భర్తల మధ్య ఉన్న ప్రేమ, అన్యోన్యత, ఒకరిని ఒకరు అర్థం చేసుకుని మెలగడం వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. అన్ని బాగానే ఉన్న కూడా ఏదో ఒక చిన్న సంఘటన వల్ల భార్యాభర్తలు ఇద్దరూ విడిపోయే పరిస్థితి వస్తుంది. అయితే ఇది సామాన్య ప్రజల్లో కంటే ఎక్కువగా సెలబ్రిటీలలో ఎక్కువగా జరుగుతుంది.

సినిమా సెలబ్రెటీల విషయంలో ఒక పెళ్లి పెటాకులు అయినప్పుడు మళ్ళీ ఇంకో పెళ్లి, జీవిత భాగస్వామి కోసం వెతుకులాట మొదలవుతుంది. అలా మొదటి పెళ్లిని పట్టాలెక్కించి మళ్ళీ పెళ్లి చేసుకున్న సినిమా సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు. హిందీ నటులు ధర్మేంద్ర, తమిళ నటుడు జెమినీ గణేశన్, ఎన్టీఆర్ నుంచి మంచు మనోజ్ వరకు చెప్పుకుంటే లిస్ట్ చాలా పెద్దదే.అయితే ఈ లిస్టులో, రెండు అంత కంటే ఎక్కువ సార్లు పెళ్లి చేసుకున్న ఇండియన్ సెలబ్రిటీస్ ఎవరున్నారో ఓ సారి చూద్దాం.

• జెమిని గణేశన్

ప్రముఖ నటుడు జెమిని గణేశన్ మొదటి భార్య అలమేలు గణేశన్. ఆయన రెండో భార్య జూలియన గణేశన్. ఇక సావిత్రి జెమిని గణేశన్ మూడవ భార్య. అంటే మొత్తంగా ఈ నటుడు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.

• సీనియర్ ఎన్టీఆర్

ప్రముఖ నటుడు, రాజకీయావేత నందమూరి తారక రామారావు మొదటి భార్య బసవతారకం. ఇక ఆయన రెండో భార్య పేరు లక్ష్మీపార్వతి.

• బోని కపూర్

బోనీ కపూర్ మొదటి భార్య మోనా శౌరీ కపూర్, రెండవ భార్య శ్రీదేవి.

• అక్కినేని నాగార్జున

అక్కినేని నాగార్జున మొదటి భార్య లక్ష్మి దగ్గుపాటి. రెండవ భార్య అమల.

• కమల్ హాసన్

కమల్ మొదటి భార్య వాణి గణపతి, రెండవ భార్య సారిక.

• పవన్ కళ్యాణ్

ప్రముఖ నటుడు, రాజకీయవేత్త పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని, రెండవ భార్య రేణు దేశాయ్, మూడవ భార్య అన్నా లెజ్నెవా

• మంచు మనోజ్

మనోజ్ మొదటి భార్య ప్రణతి రెడ్డి. రెండవ భార్య భూమా మౌనిక రెడ్డి.

Share post:

Latest