మోహన్ బాబు తనయుడు, ప్రముఖ హీరో మంచు మనోజ్ మార్చి 3వ తేదీన భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో మంచు లక్ష్మి నివాసంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఇప్పటికే పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. మంచు మనోజ్ తో పాటు మౌనికకు కూడా ఇది రెండో వివాహమే.
మనోజ్ మొదట ప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకోగా.. మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అలాగే మౌనిక బెంగళూరు కి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త గణేష్ రెడ్డి ని వివాహం చేసుకుంది. వీళ్లిద్దరికీ ఒక కొడుకు కూడా పుట్టాడు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. ఇప్పుడు మౌనిక మనోజ్ తో కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా మౌనిక కొడుకు ధైరవ్ విషయంలో మనోజ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మౌనిక కుమారుడిని తన సొంత బిడ్డలాగా చూసుకోవాలని డిసైడ్ అయ్యాడట.
ఒక తండ్రిగా అన్ని బాధ్యతలు తీసుకోబోతున్నాడట. మంచు మనోజ్ తాజాగా చేసిన ట్వీట్ తో ఈ విషయం తేలిపోయింది. ఆయన ఓ ఫోటోను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. మౌనిక రెండు చేతులను తన రెండు చేతులతో పట్టుకున్నారు. ఆ చేతులను ముద్దుముద్దుగా ఉండే మరో రెండు చేతులు పట్టుకున్నాయి. ఈ ఫొటోకు ‘శివుని ఆజ్ఞ’ అని క్యాప్షన్ పెట్టారు మనోజ్. శివుని ఆజ్ఞతో మౌనికారెడ్డిని పెళ్లిచేసుకున్నారు. అలాగే ఇందులో మరో అంతరార్థం ఏంటంటే మౌనిక కొడుకు ధైరవ్ బాధ్యత కూడా తానే తీసుకున్నానని మనోజ్ ఈ ఫొటో ద్వారా చెప్పకనే చెప్పేశాడు. దీంతో మనోజ్ మంచి మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
శివుని ఆజ్ఞ 🙏🏼❤️ #MWedsM #ManojWedsMounika pic.twitter.com/U5hQ5V9xqL
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 4, 2023