న్యూ లుక్‌లో మ‌హేష్‌.. ఏమున్నాడ్రా.. అబ్బాయిలు కూడా పిచ్చెక్కిపోతారు!

ఇండియన్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ హీరోల లిస్ట్ తీస్తే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు మొదటి స్థానంలో నిలుస్తాడు. రోజు అన్నం తింటున్నాడో లేక అందాన్ని తింటున్నాడో తెలియదు కానీ.. 47 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిగా కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం మహేష్ బాబు అందానికి దాసోహం అంటుంటారు.

ఇకపోతే తాజాగా మహేష్ బాబు న్యూ లుక్ లో దర్శనమిచ్చి అందరి మతలు చెడగొట్టాడు. జిమ్ లో తన వర్కౌట్ కు సంబంధించిన ఫోటోను మహేష్ అభిమానులతో పంచుకున్నాడు. ఆ ఫోటోకు `ఆర్మ్ డే` అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. తన తదుపరి చిత్రాల కోసం ఉక్కులాంటి శరీరాన్ని తయారు చేసుకుంటున్నాడు. జిమ్ లో హెవీ వర్కౌట్ చేస్తూ బాడీని బిల్డ్ చేస్తున్నాడు.

ఇక మహేష్ తాజా లుక్ చూసిన నెటిజ‌న్లు.. ఏమున్నాడ్రా బాబు అబ్బాయిలు కూడా పిచ్చెక్కిపోతారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి మహేష్ న్యూ లుక్ అయితే నెట్టింట వైరల్ గా మారింది. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో త‌న 28వ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాడు. ఈ మూవీ అనంతరం దర్శకధీరుడు రాజమౌళితో ఓ పాన్ ఇండియా మూవీని చేయబోతున్నాడు. ఈ మూవీ కోసమే మహేష్ తన దేహాన్ని మార్చుకునేందుకు కసరత్తులు చేస్తున్నాడని అంటున్నారు.

Share post:

Latest