23 ఏళ్లు గా అలాంటి పని చేయని ఏకైక హీరో మహేష్ బాబు..!!

టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి నటన గురించి, అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు రీమిక్స్ సినిమాలను టచ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది మాత్రం టచ్ చేయని వారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ,చిరంజీవి, వెంకటేష్ ,నాగార్జున, ప్రభాస్ ,అల్లు అర్జున్ ఇలా ఎంతో మంది హీరోలు రీమేక్ కథలతో సినిమాలు చేయడం జరిగింది.కానీ మహేష్ బాబు మాత్రం ఇందుకు మినహాయింపుగా నిలిచారు

All about South Indian Actor Mahesh Babu - The Statesman
మహేష్ బాబు హీరోగా 23 ఏళ్ల కెరియర్లో ఏ ఒక్క రీమిక్స్ సినిమాలో కూడా నటించలేదు. మొదటిసారి రాజకుమారుడు సమయంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా మహేష్ బాబు ఏదైనా నిర్ణయం తీసుకున్నాడు అంటే వాటికి కట్టుబడి ఉంటారని చెప్పవచ్చు. మహేష్ కూడా ఎన్నోసార్లు తాను రీమిక్స్ సినిమాలకు దూరంగానే ఉంటానని తెలియజేయడం జరిగింది. రీమిక్స్ సినిమాలు చేయడం వల్ల కంపారిజన్ కావడం జరుగుతుంది రీమిక్కులతో ఎంత బాగా నటించినా కొన్నిసార్లు ఒరిజినల్ హీరోలతో పోలిస్తూ కామెంట్ చేస్తూ ఉంటారని అలాంటి రిస్కీ అనే ఆలోచనతో మహేష్ బాబు ఇప్పటివరకు రీమేక్ కథలను ఓకే చెప్పలేదని సమాచారం.

గతంలో కత్తి, త్రీ ఇడియట్స్ సినిమాలో రీమిక్స్ లో నటించే అవకాశం వచ్చినప్పుడు మహేష్ బాబు మాత్రం వాటిని తిరస్కరించారట.టాలీవుడ్లో స్టార్ హీరోలలో రీమిక్స్ సినిమాలో నటించని హీరోగా పేరు పొందారు మహేష్ బాబు . ఆ తర్వాత రీమిక్స్ చేయాలి హీరోల జాబితాలలో హీరో విజయ్ దేవరకొండ మాత్రమే ఉన్నారు విజయ్ ఇప్పటివరకు ఎలాంటి కథలతో సినిమాలు చేయడం లేదు.

Share post:

Latest