లోకేష్‌కు ఎన్టీఆర్ సెగ..తగ్గట్లేదుగా!

2019 ఎన్నికల్లో టి‌డి‌పి దారుణంగా ఓడిపోయిన దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన పెద్ద ఎత్తున విషయం తెలిసిందే. ఇంకా టి‌డి‌పిని ఎన్టీఆర్ కు అప్పగించాలని ఆయన ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ మీటింగుల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. సి‌ఎం ఎన్టీఆర్ అంటూ జెండాలు పట్టుకుని తిరుగుతున్నారు. ఎలాగో చంద్రబాబుకు వయసు మీద పడిందని, లోకేష్ కు పార్టీని నడిపినే సామర్థ్యం లేదని, అందుకే ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ వస్తుంది.

టి‌డి‌పిని మళ్ళీ గెలిపించే సత్తా ఎన్టీఆర్‌కే ఉందని అభిమానులు అంటున్నారు. అయితే ఎన్టీఆర్ అభిమానుల ముసుగులో వైసీపీ శ్రేణులు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారని, టి‌డి‌పిలో చిచ్చు పెట్టడానికి ఆ రకంగా చేస్తున్నారని టి‌డి‌పి శ్రేణులు మండిపడుతున్నాయి. కానీ ఏదేమైనా టి‌డి‌పిలో ఎన్టీఆర్ పేరు వినిపిస్తూనే ఉంది. చంద్రబాబు, లోకేష్ సభల్లో ఎన్టీఆర్ జెండాలతో ఫ్యాన్స్ హంగామా చేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో తాజాగా లోకేష్ పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో జరిగింది. ఈ క్రమంలో కొందరు ఎన్టీఆర్ అభిమానులు..ఎన్టీఆర్ ఫ్లెక్సీ కట్టారు.

పైగా దానిపై అన్న పెట్టిన పార్టీ అధికారంలోకి రావాలంటే ఎన్టీఆర్ రావాలి..అంటూ రాశారు. దీంతో మరోసారి తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ పేరు హైలైట్ అయింది. ఇటీవల కూడా లోకేష్..జూనియర్ ఎన్టీఆర్ ని 100 శాతం రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నానని చెప్పారు. అసలు ఆయన తాత పెట్టిన పార్టీలోకి లోకేష్ ఆహ్వానించేది ఏంటి? అని టి‌డి‌పి అసలు ఎన్టీఆర్‌దే అని కొడాలి నాని, వంశీలు అంటున్నారు.

ఇలా పార్టీలో ఎన్టీఆర్ పేరు వినపడుతూ ఉంది. కానీ ఆయన ఇప్పటిలో రాజకీయాల్లోకి వచ్చే పరిస్తితి లేదు. అలాంటప్పుడు ఫ్యాన్స్..ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి లాగడం కరెక్ట్ కాదనే చెప్పాలి.

Share post:

Latest