లారెన్స్ రుద్రుడు తెలుగు సినిమా హక్కులు అన్ని కోట్లేనా ..?

కొరియోగ్రాఫర్ గా మొదట తన కెరీర్ ని మొదలుపెట్టిన రాఘవ లారెన్స్ ఆ తర్వాత దర్శకుడుగా, నటుడుగా మారి హీరోగా కూడా పలు టాలెంటెడ్ చిత్రాలను నటిస్తూ ఉన్నారు రాఘవ లారెన్స్. కాంచన సిరీస్తో లారెన్స్ తెలుగు ,తమిళ్ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్నారు.ఇక కాంచన సిరీస్ కి ప్రస్తుతానికి గ్యాప్ ఇచ్చిన లారెన్స్ రెండు సినిమాలని లైన్లో పెట్టారు. ఒకటి రుద్రుడు పేరుతో తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక అంతే కాకుండా చంద్రముఖి సినిమాకి సీక్వెల్ గా కూడా చేయబోతున్నారు.

Raghava Lawrence Rudrudu in Theatres On this date. - TeluguBulletin.com
ఈ చిత్రంలో ఊర్వశి రౌతెలా కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు లారెన్స్. ఇక తెలుగులో కూడా రాఘవ లారెన్స్ కు కాస్త మార్కెట్ భారీగానే ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే అతని సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయడం కోసం కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారు. ఇదంతా ఇలా ఉంటే తాజాగా రుద్రుడు సినిమాని తెలుగులో విడుదల చేసేందుకు ఏకంగా రూ .6 కోట్ల రూపాయలకు.. పూర్వీ పిక్చర్స్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ సినిమా ఏప్రిల్ 14న పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్నది తెలుగు రైట్స్ ని ఒక చిన్న సినిమా బడ్జెట్ ధర పెట్టి కొనుగోలు చేయడం ఇప్పుడు పెను సంచలనంగా మారుతోంది. ఇప్పుడు మాస్ కమర్షియల్ మూవీగా వస్తున్న రుద్రుడు సినిమా మీద ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.