బింబిసారా-2 చిత్రానికి డైరెక్టర్ని మార్చేసిన కళ్యాణ్ రామ్..!!

కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన చిత్రాలలో బింబిసారా సినిమా కూడా ఒకటి. ఈ చిత్రం ఎవరు ఊహించని విధంగా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా నిర్మాతగా హీరో కళ్యాణ్ రామ్ మళ్ళీ కలిసి వచ్చిందని చెప్పవచ్చు. డైరెక్టర్ వశిష్ట కూడా ఈ సినిమాతో మంచి పేరు సంపాదించారు.మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా సీక్వెల్ పైన భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి రెండవ భాగం ఎప్పుడు విడుదలవుతుందనే విషయం అందరిలోనూ ఆసక్తిని నెలకొల్పేలా చేస్తోంది.
Bimbisara 2 EXCLUSIVE: Vassishta Mallidi aka MVN Reddy shares a BIG update  on Kalyan Ram starrer | PINKVILLA
తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా నుంచి మొదటి భాగాన్ని దర్శకత్వం వహించిన వశిష్ట రెండవ భాగానికి కూడా దర్శకత్వం వహించలేదని తెలుస్తున్నది.ఈ సినిమా యూనిట్ అలాగే వశిష్టకు మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో ఈయన ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అలాగే కళ్యాణ్ రామ్ వశిష్ట విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని యూనిట్ అత్యంత సన్నిహిత వర్గం నుంచి తెలియజేసినట్లు సమాచారం ఈ నిర్ణయం ఇద్దరూ కలిసి తీసుకున్నారు అని కూడా తెలుస్తోంది.
Bimbisara director on rejection spree..? - TeluguBulletin.com
కళ్యాణ్ రామ్ మరొక డైరెక్టర్ కి ఈ సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలియజేశారు. ఈ చిత్ర రెండవ భాగాన్ని డైరెక్టర్ అనిల్ పాదురినీ తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.గతంలో రొమాంటిక్ సినిమాకి దర్శకత్వం వహించారు .అయితే ఈ సినిమా మొదటి భాగానికి సంబంధించి విఎఫ్ఎక్స్ వర్క్ అన్నీ కూడా ఆయనే చూసుకున్నారట. అలా ఆయన మీద ఉన్న నమ్మకంతోనే కళ్యాణ్ రామ్ ఈ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

Share post:

Latest