వైసీపీ రెబల్స్ మళ్ళీ గెలుస్తారా?

అధికార వైసీపీలో రెబల్స్ నాయకులు పెరుగుతున్న విషయం తెలిసిందే. సొంత పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉండటం, కొందరు నాయకులతో విభేదాల వల్ల ఇప్పటివరకు ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి దూరం జరిగిన విషయం తెలిసిందే. సమస్యలపై ప్రశ్నిస్తే..సొంత పార్టీ వాళ్ళనే వైసీపీ సైడ్ చేస్తుంది. అలా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు..మొదటలోనే వైసీపీ నుంచి దూరం జరిగారు. ఆయన అప్పటినుంచి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అలా రఘురామ రెబల్ గా మారారు. ఇక ఈ మధ్య వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి..వైసీపీకి దూరమయ్యారు. తన నియోజకవర్గ సమస్యలు అధికారుల తీరుని ఎండగట్టిన ఆనంకు వైసీపీకి చెక్ పెడుతూ ఆయన నియోజకవర్గానికి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఇంచార్జ్ గా పెట్టారు. దీంతో ఆనం వైసీపీకి దూరమయ్యారు. ఈయన వెనుక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీకి షాక్ ఇచ్చారు. సొంత పార్టీ వాళ్లే తన ఫోన్‌ని ట్యాప్ చేస్తున్నారని చెప్పి..కోటంరెడ్డి వైసీపీకి దూరం జరిగారు.

ఇలా ముగ్గురు నేతలు వైసీపీకి రెబల్స్ మాదిరిగా తయారయ్యారు. ఇక వీరు టి‌డి‌పిలోకి వెళ్ళి..ఆ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఎన్నికల మూడే పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తాము మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తామని రఘురామ అంటున్నారు. రెబల్స్ ముగ్గురం వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరుతామని అంటున్నారు.

అయితే రఘురామ నరసాపురం ఎంపీగానే మళ్ళీ పోటీ చేసే ఛాన్స్ ఉంది..ఇటు కోటంరెడ్డి నెల్లూరు రూరల్ బరిలో ఉంటారు. ఆనం ఎక్కడ నుంచి పోటీ చేస్తారో క్లారిటీ లేదు. మరి చూడాలి రెబల్ నాయకులు మళ్ళీ గెలుస్తారో లేదో.