పెళ్లై నెల కాక‌ముందే ప్రెగ్నెంట్.. బిగ్ అనౌన్స్‌మెంట్ అంటూ కియారా పోస్ట్‌!

ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి.. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో ఇదే ట్రెండ్ న‌డుస్తోంది. బీటౌన్‌కు చెందిన కొంద‌రు భామలు ముందు ప్రెగ్నెంట్ అవుతున్నారు.. ఆ త‌ర్వాత పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అలియా భట్ కూడా పెళ్లికి ముందే తల్లి అయింది. ఆపై రణబీర్ కపూర్‌ను వివాహం చేసుకుంది.

ఇప్పుడు ఈ జాబితాలో కియారా అద్వానీ కూడా చేరిందంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ బిజీ బ్యూటీ బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో ఇటీవ‌లె పెళ్లి పీట‌లెక్కిన సంగ‌తి తెలిసిందే. ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని సూర్యగఢ్ ప్యాలస్‌లో కియారా-సిద్ధార్థ్ వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జరిగింది. అయితే పెళ్లికి ముందే కియారా ప్రెగ్నెంట్ అంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ ప్ర‌చారానికి కియారా తాజా పోస్ట్ మ‌రింత బ‌లాన్ని చేకూర్చింది. కియారా తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. త్వరలోనే బిగ్ అనౌన్స్‌మెంట్ రాబోతోంది అంటూ ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో ప్లేట్ నిండా మామిడి పండ్లు పెట్టుకుని కియారా తింటూ క‌నిపించింది. దీంతో పెళ్లై నెల కాక‌ముందే ప్రెగ్నెంట్ అంటూ ప్ర‌చారం మొద‌లైంది. మ‌రికొంద‌రు పెళ్లికి ముందే కియారా గ‌ర్భం దాల్చింద‌ని.. ఆ త‌ర్వాతే వివాహం చేసుకుంద‌ని చ‌ర్చించుకుంటున్నారు.

Share post:

Latest