భూమా మౌనిక రెడ్డికి ఒక కొడుకు ఉన్నాడా..? అస‌లింత‌కీ మొదటి భర్త ఎవరు?

మోహ‌న్ బాబు త‌న‌యుడు మంచు మ‌నోజ్ తాజాగా భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. శుక్ర‌వారం వీరి వివాహం హైద‌రాబాద్ లో మంచు ల‌క్ష్మి నివాసంలో వైభ‌వంగా జ‌రిగింది. మంచు మ‌నోజ్ కు ఇది రెండో వివాహం. 2015లో ప్రణతి అనే అమ్మాయిని మ‌నోజ్ వివాహం చేసుకున్నాడు. కానీ వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు.

ఇప్పుడు మౌనిక రెడ్డితో ఏడ‌డుగులు వేశారు. కుటుంబ‌స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మ‌రియు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు వీరి పెళ్లికి హాజ‌రు అయ్యారు. ఇక‌పోతే మౌనిక రెడ్డికి కూడా ఇది రెండో వివాహ‌మే. ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. మౌనిక దివంగత నేత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ల రెండవ కుమార్తె. ఈమె అసలు పేరు భూమా నాగ మౌనిక.

గతం లో ఆమె బెంగళూరు కి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త గణేష్ రెడ్డి ని వివాహం చేసుకుంది. వీళ్లిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. అయితే రెండేళ్ల క్రితం వీళ్ళ మధ్య ఏర్పడిన కొన్ని విబేధాల కారణం గా విడాకులు తీసుకున్నాడు. ప్ర‌స్తుతం ఐదు సంవ‌త్స‌రాల కొడుకు భూమా మౌనిక ద‌గ్గ‌రే ఉంటున్నాడు. తండ్రిలానే మౌనిక కూడా ఆళ్లగడ్డ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తోంది. ఇందులో భాగంగానే గ‌త కొన్నాళ్లుగా రాజ‌కీయాల్లో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

Share post:

Latest