40 ఏళ్ల క్రితం టాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్ ఎంతుందో తెలిస్తే!

ప్రస్తుతం ఏ హీరో అయినా పాన్ ఇండియా సినిమాలో నటించాలంటే రూ.100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఇంత అమౌంట్ కూడా హీరోల రేంజ్ వద్ద చీప్ గానే కనిపిస్తోంది. హీరోలకు రిస్క్ ఫ్యాక్టర్ని బట్టి రెమ్యునరేషన్లు ఫిక్స్ చేసుకుంటుంటారు. పుష్ప సినిమాకు అల్లు అర్జున్ 75 కోట్లు తీసుకుంటే, బాహుబలి సినిమాకి తప్ప ఇప్పుడు అన్ని సినిమాలకు ప్రభాస్ రూ.100 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. అయితే చిన్న చితకా హీరోల విషయానికి వస్తే వీరు కూడా కోట్లల్లోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని కచ్చితంగా చెప్పగలం.

అయితే ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ, ఏఎన్నార్, శోభన్ బాబు లాంటి సీనియర్ స్టార్ హీరోలు ఎంత రెమ్యునరేషన్ తీసుకునేవారు అనే ఆసక్తి చాలా మందిలో మొదలైంది. ఆ విషయాలు తెలుసుకుంటే.. ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అంటే ఆ సినిమా బడ్జెట్ రూ.40 లక్షలు ఉండేది. దాంట్లో ఎన్టీఆర్ రెమ్యునరేషన్ రూ.12 లక్షలు ఉండేది. అయితే అప్పట్లో అదే హైయెస్ట్ రెమ్యునరేషన్. ఆ తర్వాత ఏఎన్ఆర్ సినిమాలకు రూ.30 లక్షల బడ్జెట్ ఉంటే, ఆయన ఒక్క సినిమాకు 10 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునేవారట.

ఇక కృష్ణ సినిమాలకు రూ. 20 నుంచి రూ. 25 లక్షల వరకు బడ్జెట్ ఉంటే అందులో ఆయన రూ.7 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవారు. శోభన్ బాబు విషయానికి వస్తే ఆయన రెమ్యునరేషన్ కూడా కృష్ణతో సమానంగా ఉండేది. ఈయన సినిమా బడ్జెట్ కూడా రూ. 20 లక్షలు ఉంటే రెమ్యునరేషన్ రూ.7లక్షల తీసుకునేవారు. ఆ తర్వాత జనరేషన్లో వచ్చిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ,నాగార్జున లాంటి హీరోలు ఒక్కోరు ఒక్కో రేంజ్ లో కోట్లల్లో పారితోషికం పుచ్చుకుంటూ ఆశ్చర్యపరిచేవారు.