ఆస్కార్ వేడుక భవనంలో డాల్బీ థియేటర్ ఎంత పెద్దగా ఉంటుందో తెలిస్తే..

సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 95వ అకాడమీ వేడుకల సందడి మొదలైంది. ప్రపంచంలోని నలుమూలల నుంచి ఎన్నో సినిమాలు ఈ ప్రతిష్టాత్మక అవార్డ్‌ని అందుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఆ పోటీ పడుతున్న సినిమాలో మన తెలుగు సినిమా అయిన ఆర్ఆర్ఆర్ కూడా ఉంది. ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రముఖులు, సెలెబ్రిటీలు అమెరికాకి వెళ్లారు. మార్చి 12న జరగబోయే ఈ వేడుక అమెరికాలోని కాలిఫోర్నియాలో లాస్ ఏంజిల్స్‏ని డాల్బీ థియేటర్‏లో ఎంతో వైభవంగా జరగనుంది. ఇప్పటికే డాల్భీ థియేటర్ ని అద్భుతంగా ముస్తాబు చేసారు. అయితే ఆస్కార్ అవార్డుల వేడుక ఈ థియేటర్ లోనే ఎందుకు చేస్తారు? అసలు థియేటర్ ప్రత్యేకతలు ఏంటి?… అవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం.

డాల్బీ థియేటర్ ను అమెరికాలోని లాస్ ఏంజెల్స్‏లో నిర్మించారు. 2001 నవంబర్ 9 నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. నిజానికి ఈ థియేటర్ ప్రత్యేకంగా ఆస్కార్ అవార్డ్స్ వేడుకలను దృష్టిలో ఉంచుకుని రాక్ వెల్ గ్రూపుకు చెందిన డేవిడ్ రాక్ వెల్ రూపొందించారు. ఈ థియేటర్ లో ఆస్కార్ అవార్డ్స్ తోపాటు, ఇతర ఫిల్మ్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. అమెరికాలోనే అతిపెద్ద థియేటర్ ఇది. 113 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవులో ఉంటుంది. ఈ థియేటర్ లో ఒకేసారి ముదువేలకు పైగా జనాలు కూర్చోవచ్చు. థియేటర్ లో కెమెరా, సౌండ్, స్టేజ్ మేనేజ్మెంట్ కోసం ఆర్కెస్ట్రా సీటింగ్ కోసం ప్రత్యేకంగా కాక్ పిట్ రూపొందించారు. డాల్బీ థియేటర్ చుట్టు పక్కల కేవలం షాపింగ్ మాల్స్ మాత్రమే ఉంటాయి. ఆస్కార్ అవార్డుల వేడుకలు జరిగే సమయంలో అక్కడ హాలీవుడ్ సినిమాల నిర్మాణాన్ని గుర్తుతెచ్చే విధంగా ఈ భవనం ముందు బొమ్మలకు దుస్తులు వేసి ఉంచుతారు. అవార్డ్ గెలిచిన విజేతలకు మెట్ల మార్గంలో రెడ్ కార్పెట్ ఉంటుంది. 2002లో మొదటిసారి ఈ థియేటర్ లో 74వ ఆస్కార్ అవార్డ్ వేడకలు నిర్వహించారు.

ఈ అద్భుతమైన భవనానికి పేరు పెట్టే హక్కుల కోసం ఈస్ట్ మన్ కొడాక్ కంపెనీసుమారు $75 మిలియన్స్ చెల్లించింది. ఇక 2012లో ఈ థియేటర్ నామకరణ హక్కుల ఒప్పందం పూర్తికావడం తో దీనికి తాత్కాలికంగా హాలీవుడ్ హైలాండ్ సెంటర్‏గా నామకరణం చేశారు. 2012న మే1న దీనికి డాల్బీ లాబొరేటరీస్ 20ఏళ్ల నామకరణ హక్కుల ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత దీని పేరును డాల్బీ థియేటర్ గా మారుస్తూ ప్రకటించారు.

Share post:

Latest