హన్సిక తల్లి డిమాండ్స్ మామూలుగా లేవే.. నిమిషానికి రూ.5 లక్షలు ఇవ్వాలట!!

ప్రముఖ నటి హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిందీ అమ్మడు. తెలుగు, తమిళ భాషలో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకుంది. అంతేకాకుండా ప్రేమ వ్యవహారంలో ఈ బ్యూటీ పేరు బాగానే వినిపించింది. హీరో శింబుతో ప్రేమలో పడింది. ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది.

గత ఏడాది డిసెంబర్‌ 4న ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్‌ కతురియకు, హన్సిక కు వివాహం జరిగిన విషయం తెలిసిందే. జైపూర్‌లోని 450 ఏళ్ల నాటి ప్రసిద్ధి చెందిన ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకను కూడా హన్సిక కుటుంబం వ్యాపారంగా మార్చేశారు. హన్సిక పెళ్లి వేడుకకు సంబంధించిన ప్రసార హక్కులను డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ ఓటీటీ సంస్థకు ఆమేసారు. దీంతో ఆ సంస్థ హన్సిక వివాహ వేడుకతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, వరుడు సోహైల్‌తో వారికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను ప్రత్యేకంగా చిత్రీకరించారు.

దాన్ని ఇప్పుడు లవ్‌ షాది డ్రామా పేరుతో ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. అందులో హన్సిక, ఆమె తల్లి మోనా మోత్వానీ గతంలో వారు ఎదుర్కొన్న సమస్యల గురించి,వాటిని పరిష్కరించాడానికి తీసుకున్న నిర్ణయాల గురించి పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అయిన లవ్‌ షాది డ్రామా ఎపిసోడ్‌లో హన్సిక తల్లి మోనా చెప్పిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేమిటంటే వివాహ జరిగే సమయంలో వరుడు సోహైల్‌ కుటుంబ సభ్యులు మండపానికి సరైన సమయానికి చేరుకోకపోవడంతో టెన్షన్‌ అయిన మోనా మోత్వానీ, సోహైల్‌ తల్లికి ఫోన్‌ చేసి ఇంకా మీరు ఆలస్యంగా వస్తే ప్రతి నిమిషానికి రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని కోరారట. ఈ విషయాన్ని ఆమె ఆ ఎపిసోడ్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

Share post:

Latest