గుంటూరు మంత్రులకు మళ్ళీ ఛాన్స్ లేనట్లే!

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార బలంతో వైసీపీపై నిదానంగా ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నట్లే కనిపిస్తోంది..అటు ప్రతిపక్ష టి‌డి‌పి నిదానంగా పుంజుకుంటుండగా, ఇటు జనసేన సైతం బలపడుతుంది. తాజాగా వచ్చిన సర్వేల్లో అదే స్పష్టమవుతుంది. అదే సమయంలో ఈ సారి వైసీపీ గాలి కష్టమే అని, జగన్ ఇమేజ్ సైతం వైసీపీని గట్టెక్కించడం ఇబ్బందే అని తెలుస్తోంది.

ఈ క్రమంలో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఓటమి అంచున ఉన్నారని తాజా సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు మళ్ళీ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సర్వేలో తేలింది. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న విషయం తెలిసిందే. అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, విడదల రజిని..వీరు మంత్రివర్గంలో ఉన్నారు. గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో ముగ్గురు గెలిచారు. ఈ సారి జగన్ వేవ్ ఉండేలా లేదు..పైగా ముగ్గురు మంత్రుల పనితీరు అంతంత మాత్రమే..ముగ్గురుపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది.

సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబటి రాంబాబుకు ఈ సారి గెలుపు కష్టమే అని, ఈ సారి గట్టి పోటీ ఎదుర్కొక తప్పదని తెలుస్తోంది. అయితే ఇక్కడ టి‌డి‌పి-జనసేన విడిగా పోటీ చేస్తే అంబటికి కాస్త అడ్వాంటేజ్ అవుతుంది. అదే రెండు పార్టీలు కలిస్తే ఇంకా అంబటికి చెక్ ఖాయం.

అటు పొత్తుతో సంబంధం లేకుండా చిలకలూరిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రజినికి ఈ సారి ఓటమి తప్పదని సర్వేలో తేలింది. ఇక్కడ టి‌డి‌పి లీడ్ లోకి వస్తుంది. అలాగే వేమూరు నుంచి ఉన్న నాగార్జునకు గెలుపు దక్కడం కష్టమే అని తేలింది.