మహేష్ బాబు తీరుపై మండిపడుతున్న ఫ్యాన్స్‌.. ఇలాంటి పని ఎవరూ చేయకూడదు??

ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా వంటి డైనమిక్ డైరెక్టర్స్‌తో కలిసి పనిచేయకుండా తన అభిమానులకు కోపం తెప్పిస్తున్నాడు హీరో మహేష్ బాబు. వారితో చర్చలు జరుపుతున్నప్పటికీ, ఈ ప్రతిభావంతులైన డైరెక్టర్లతో సినీ ప్రాజెక్ట్‌లను మహేష్ చేయకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. అర్జున్ రెడ్డి, కేజిఎఫ్ లాంటి సినిమాలలో మహేష్ బాబును వారు చూడాలనుకుంటున్నారు. కానీ మహేష్ త్రివిక్రమ్ లాంటి దర్శకులతో జతకడుతూ రొటీన్ కమర్షియల్ ఫిలిమ్స్‌కే పరిమితమవుతున్నాడని వారు కంప్లైంట్ చేస్తున్నారు. అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు వీరితో కోలాబరేట్ అవుతున్నారు కానీ మహేష్ ఎందుకు కావడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.

అయితే, మహేష్ బాబు ప్రస్తుత లైన్ అప్ చాలా క్రేజీగా ఉందనడంలో సందేహం లేదు. ఈ ప్రిన్స్ ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ ‘అల వైకుంఠపురములో’ను అందించిన త్రివిక్రమ్‌తో కలిసి పని చేస్తున్నాడు. అలానే భారతదేశంలోనే టాప్ డైరెక్టర్ రాజమౌళితో భారీ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టాడు. ఈ ప్రాజెక్ట్‌లు మంచి హైప్‌ని సృష్టించాయి. తప్పకుండా బ్లాక్‌బస్టర్‌లు అవుతానే ధీమాతో అభిమానులు ఉన్నారు. కాబట్టి మహేష్ అభిమానులు ఎప్పుడూ అతను క్రేజీ డైరెక్టర్లతో పని చేయనంత మాత్రాన ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ గ్లోబల్ స్టార్ కావడం కచ్చితం అని మరికొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే మార్చి 2న ప్రిన్స్ జిమ్‌లోని కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసాడు. వాటిలో, అతను కొత్త అవతార్‌లో కనిపిస్తాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ డైరెక్ట్ చేస్తున్న తన కొత్త చిత్రం SSMB 28లో అతను ఈ ఆకట్టుకునే కొత్త లుక్‌లో కనిపిస్తాడని టాక్ నడుస్తోంది.

Share post:

Latest