బిగ్ బాస్ హిమజాను కూడా ఆ విధంగా టార్చర్ పెట్టారా..!!

బుల్లితెర సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి హిమజ. ఇక తర్వాత బిగ్ బాస్ లో అవకాశాన్ని అందుకుంది ఇలా బిగ్ బాస్ కార్యక్రమము ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత సీరియల్స్ కు దూరమై వెండితెర పైన పలు చిత్రాలలో నటిస్తూ సందడి చేస్తోంది. ఇప్పటికి కూడా పలు చిత్రాలలో నటిస్తూనే ఉంది. ఇక తానే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఎన్నో రకాల వీడియోలను అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా హిమజ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది.

పెళ్లిళ్లు నాకు సెట్‌ కావు.. విడాకులపై స్పందించిన బిగ్‌బాస్ బ్యూటీ హిమజ |  Bigg Boss Himaja responds on her divorce news - Telugu Filmibeat

ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో తనను కూడా ఎంతోమంది ఇబ్బంది పెట్టారని ఎన్నో అవమానాలు చేశారని ఇక చాలా మంది తనని బాడి షేవింగ్ ట్రోల్స్ కూడా చేశారని.. ఈ సందర్భంగా అప్పటి జరిగిన కొన్ని సంఘటనలను తెలియజేస్తోంది హిమజ. అయితే ఇలాంటి సంఘటనలను తలచుకున్నప్పుడల్లా చాలా ఏడుపొస్తుందని అయితే అవమానాలను చూసి తాను ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదని తెలుపుతోంది.

Himaja, Bigg Boss Telugu 3: నా జీవితం ఆగిపోలేదు.. ఇప్పుడే మొదలైంది: బిగ్  బాస్ హిమజ భావోద్వేగం - bigg boss 3 contestants himaja emotional words about  her elimination - Samayam Telugu
మనం చేసే పని కరెక్ట్ గా ఉంటే ఎవరికి భయపడాల్సిన పనిలేదని పనికిరాని మాటలు గురించి ఎక్కువగా ఆలోచించకూడదని అలా ఆలోచిస్తే అక్కడే ఉండిపోతామని తెలిపింది.కెరియర్ మొదట్లో తన నడక అసలు అమ్మాయిల నడకలాగలేదని.. మగవారి నడక లాగా ఉందని ట్రోల్ చేశారని.. ఇక డైరెక్టర్లు స్వయంగా నా కళ్ళ ఏమాత్రం బాగుండవని కామెంట్లు చేశారు ఇలాంటివి విన్నప్పుడు చాలా ఏడుపు వచ్చిందని తెలుపుతోంది.

అయితే మేకప్ వేసుకున్న తర్వాత వాళ్లే మల్లి కళ్ళే హైలెట్ అయ్యాయని తనను విమర్శించే వారి మెచ్చుకున్నారని తెలుపుతోంది హిమజ ఇక సోషల్ వర్క్ గురించి మాట్లాడుతూ బయట ఏదో చేయడం కంటే మన ఇంటిని మనం మంచిగా చూసుకోవాలి అంటూ తెలిపింది. తన కార్ డ్రైవర్ పిల్లలను చదివించే బాధ్యత కూడా తీసుకున్నానని తెలుపుతోంది.

Share post:

Latest