అనుష్క శెట్టి-నవీన్‌ పొలిశెట్టి మూవీకి క్రేజీ టైటిల్‌.. ఫ‌స్ట్ లుక్ వైర‌ల్‌!

టాలీవుడ్ లేడీ సూప‌ర్ స్టార్ అనుష్క శెట్టి, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో న‌వీన్ పొలిశెట్టి జంట‌గా ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత అనుష్క చేస్తున్న చిత్ర‌మిది. ‘రారా.. కృష్ణయ్య’ ఫేమ్ మహేష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు.

40 ఏళ్ల మహిళకు 25 సంవత్సరాల కుర్రాడికీ మధ్య జరిగే ప్రేమకథగా ఈ మూవీ రూపొందనుందని సమాచారం. ఇందులో అనుష్క `అన్విత ర‌వ‌ళి` అనే చెఫ్ పాత్ర‌లో అల‌రించబోతోంది. అలాగే న‌వీన్ పొలిశెట్టి స్టాండ్-అప్ కమెడియన్‌గా మారాలని కోరుకునే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కనిపించనున్నాడు. అయితే తాజాగా ఈ మూవీ టైటిల్ ను రివిల్ చేస్తూ ఫ‌స్ట్ లుక్ ను బ‌య‌ట‌కు వ‌దిలారు.

ఈ సినిమాకు `మిసెస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి` అనే క్రేజీ టైటిల్ ను లాక్ చేశారు. ఇక ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విష‌యానికి వ‌స్తే.. అనుష్క ఓ పుస్తకం పట్టుకుని తన డ్రీమ్‌లోకి వెళ్లిపోయి ఏదో ఆలోచిస్తూ క‌నిపించింది. మరోవైపు గోడపై కూర్చొని నవీన్‌ పొలిశెట్టి తనఊహల్లో తేలిపోతూ క‌నిపించారు. అయితే అనుష్క లండన్‌లో ఉండగా, నవీన్‌ హైదరాబాద్‌లో ఉన్న‌ట్లు పోస్ట‌ర్ లో చూపించారు. మ‌రి వీరిద్ద‌రూ ఎలా క‌నెక్ట్ అయ్యారో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Share post:

Latest