పెళ్లి త‌ర్వాత న‌ర‌కం.. అయినవాళ్లే అలా చేశారంటూ అలేఖ్య‌రెడ్డి సంచ‌ల‌న పోస్ట్‌!

ప్ర‌ముఖ‌ న‌టుడు నంద‌మూరి తార‌క‌ర‌త్న కొద్ది రోజుల క్రిత‌మే త‌నువు చాలించిన సంగ‌తి తెలిసిందే. తార‌క‌ర‌త్న మ‌ర‌ణం నుంచి ఆమె భార్య అలేఖ్య రెడ్డి ఇంకా బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోతోంది. తన మ‌న‌సులో ఉన్న బాధ‌ను సోష‌ల్ మీడియాలో పంచుకుంటూ త‌ర‌చూ వార్త‌లు నిలుస్తోంది. ఇక‌పోతే తార‌క‌ర‌త్న‌, అలేఖ్య రెడ్డి పెద్ద‌ల‌ను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న విష‌యం విధిత‌మే. అలేఖ్య‌ను వివాహం చేసుకోవ‌డం తార‌క‌ర‌త్న త‌ల్లిదండ్రుల‌కు ఏ మాత్రం ఇష్టం లేదు.

దాంతో వారు పెళ్లి త‌ర్వాత తార‌క‌ర‌త్న, అలేఖ్యల‌ను దూరం పెట్టారు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ తాజాగా అలేఖ్య‌రెడ్డి సంచ‌ల‌న పోస్ట్ పెట్టింది. పెళ్లి త‌ర్వాత ఎన్ని క‌ష్టాలు ప‌డ్డామో.. ఎంత న‌ర‌కం చూశామో వివ‌రించింది. `నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి సరిగ్గా నెల రోజులు అవుతోంది. కానీ నీ జ్ఞాపకాలు నా మదిలో ఇప్పటికీ మెదులుతూనే ఉన్నాయి. నీతో నా పరిచయం స్నేహంగా.. ఆ తర్వాత ప్రేమగా మారింది. న‌న్ను పెళ్లి చేసుకునేందుకు నువ్వు ఎంతో పోరాడావు. మన పెళ్లి నిర్ణయం అందరికీ దూరం చేసింది. మానసిక ఒత్తిడికి, ఆర్థిక ఇబ్బందులపాలు చేసింది.

 

కొందరి ద్వేషాన్ని చూడలేక మనం కళ్ళకు గంతలు కట్టుకున్నాం. అయినవాళ్లే పదే పదే మనల్ని బాధపెట్టారు. నిషికమ్మ పుట్టిన తర్వాత మన జీవితం చాలా మారిపోయింది. సంతోషం నిండింది. నీ కుటుంబానికి దూరమయ్యావు కాబట్టి మనకంటూ పెద్ద కుటుంబం ఉండాలని ఎప్పుడూ కలుల కనేవాడివి. 2019లో మనకు కవలలు జన్మించారు. దీంతో నీ కల నిజమైందని ఎంత సంతోషించావో ఇప్పటికీ నాకు గుర్తుంది. నువ్వు రియల్ హీరో. మళ్ళీ మనం కలుస్తామని ఆశిస్తున్నాను…` అని అలేఖ్య గుండెల్ని పిండేసే పోస్ట్ పెట్టింది. ఈ సంద‌ర్భంగా మామయ్య బాలకృష్ణ, పెదనాన్న విజయసాయి రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. దీంతో అలేఖ్య పోస్ట్ కాస్త వైర‌ల్ గా మారింది.

https://www.instagram.com/p/Cp6_tVEqzos/?utm_source=ig_web_copy_link

Share post:

Latest