షాకింగ్ లుక్ లో న‌టి పూర్ణ‌.. ఏమైందో తెలియ‌క‌ ఫ్యాన్స్ ఆందోళ‌న‌!

గత ఏడాది దుబాయ్‌ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ సీఈవో అయిన షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ప్రముఖ నటి పూర్ణ.. త్వ‌ర‌లోనే త‌ల్లి కాబోతోంది.పెళ్లి అయినా కొద్ది నెలలకే గ‌ర్భం దాల్చిన పూర్ణ.. మ‌రి కొద్ది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది.

ఇటీవ‌ల పూర్ణకు కుటుంబ‌స‌భ్యులు అత్యంత ఘ‌నంగా సీమంతం కూడా చేశారు. ఇదిలా ఉంటే.. నిండు గ‌ర్భిణీ అయిన పూర్ణ తాజాగా షాకింగ్ లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చింది. సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ గా ఉండే పూర్ణ.. తాజాగా కొన్ని ఫోటోల‌ను త‌న ఫాలోవ‌ర్స్ తో పంచుకుంది.

అయితే ఈ పిక్స్ లో పూర్ణ పంచెను పోలిన ఒక వైట్ క్లాత్ ను నడుముకు చుట్టుకొని బ్లాక్ త్రెడ్‌తో కట్టుకున్నారు. ఆమె లుక్ చూసి నెటిజెన్స్ ఆశ్చర్యపోయారు. పైగా ప్రెగ్నెంట్ కావ‌డంతో పూర్ణ‌కు ఏమైందో తెలియ‌క‌ ఫ్యాన్స్‌ ఆందోల‌న ప‌డ్డారు.

కానీ, హైరానా ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఏడో నెల వచ్చాక వారి ఆచారంలో గర్భిణిలకు కానూర్ అనే ఒక తంతు నిర్వహిస్తారట. అందులో భాగంగా పూర్ణ తెల్లటి వస్త్రం నడుముకు చుట్టుకున్నారు. ఈ సాంప్రదాయానికి సంబంధించిన ఫోటోలనే పూర్ణ త‌న ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది.

https://www.instagram.com/p/CpPHu4-BQTN/?utm_source=ig_web_copy_link

Share post:

Latest