లావణ్య త్రిపాఠికి ఇప్పుడైనా బ్రేక్ వస్తుందా?

ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న ఈ తార ఆ తరువాత ఒక్క హిట్ కూడా కొట్టలేదు. నిజానికి చాలామంది హీరోయిన్స్ తమ మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్స్ గా ఎదుగుతారు. అలా ‘అందాల రాక్షసి’ సినిమా ద్వారా ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది లావణ్య త్రిపాఠి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వకపోయినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.

మంచి నటన, గ్లామరస్ పాత్రలతో ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ స్టార్‌డమ్ మాత్రం తెచ్చుకోలేకపోయింది లావణ్య. ఇక ఇటీవలే ఆమె నటించిన సినిమా వల్లనైనా స్టార్ రేంజ్ ని తెచ్చుకుంటింది అని అందరూ అనుకున్నారు కానీ ‘హ్యాపీ బర్త్ డే’ సినిమా ఆమెకి నిరాశనే మిగిల్చింది.

కొంతమంది హీరోయిన్స్ ఆఫర్స్ రాకపోతే హైదరాబాద్ నుంచి తమ సొంత ప్రాంతాలకు వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా లావణ్య మాత్రం ఆఫర్స్ వస్తాయనే ఆశతో ఇక్కడే ఉండిపోయింది. సినిమాలు ఆమె చేతిలో ప్రస్తుతం ఏమీ లేకపోయినా రీసెంట్‌గా ఒక వెబ్ సిరీస్  చేసింది. దర్శకుడు, నిర్మాత కోన వెంకట్ తెరకెక్కించిన ‘పులి మేక’ వెబ్ సిరీస్ విడుదల కోసం లావణ్య ఎదురుచూస్తుంది.

గత కొంతకాలంగా ఆమె నటించిన ఆరు సినిమాల వరకు ప్లాప్ అయ్యాయి. దాంతో సరైన అవకాశాలు లేక బాధపడుతున్న లావణ్యకి ‘పులి మేక’ వెబ్ సిరీస్ ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Share post:

Latest