నాగార్జున లాగా హీరోయిన్ల కోసం ఎవరు చేయలేరు.. మమత మోహన్ దాస్..!!

2005లో మయూఖం అని మలయాళం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది హీరోయిన్ మమతా మోహన్ దాస్.. తెలుగు ప్రేక్షకులకు మాత్రం యమదొంగ సినిమాతో పరిచయమైంది.ఆ తర్వాత తెలుగులో కృష్ణార్జున, విక్టరీ ,కథానాయకుడు, చింతకాయల రవి తదితర చిత్రాలలో నటించి తన నటనతో అందరిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. చివరిగా ఈమె తెలుగులో కేడి సినిమాలో నటించింది. ఈ చిత్రంలో హీరోగా నాగార్జున నటించారు. మమతా మోహన్ తాజాగా నాగార్జున పైన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.

కేడీ సినిమాలో మమతా మోహన్ దాస్ నటించడానికి నాగార్జునే కారణమా | is nagarjuna  reason behind mamata mohan das role in kd movie details, KD movie, nagarjuna,  mamata mohandas, heroine, reason, heroine mamta ...
మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ నాగార్జునతో కేడి సినిమాలో ఒక మంచి పాత్ర తనకి ఇవ్వాలనుకున్నారట.. కానీ ఆ ఆఫర్ ఇచ్చే సమయానికి మమతా మోహన్దాస్ క్యాన్సర్ కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కేడి సినిమా కోసం నాగార్జున సార్ తనకి ఫోన్ చేశారని అప్పుడే తనకు క్యాన్సర్ ఉందని తెలియడంతో నేను సినిమాలు చేయలేనని చెప్పానని తెలిపింది. వారం తర్వాత నాగార్జున గారు మల్లీ కాల్ చేసి బాల్యంలో ఉండే సన్నివేశాలు తను పూర్తి చేస్తానని మిగతా సన్నివేశాలకి కలిసి పనిచేద్దామని చెప్పారట.

నాకోసం డైరెక్టర్ నిర్మాత మరియు నాగార్జున గారు ఆరునెలల పాటు ఉండే నా కీమో సెట్టింగ్ కి ఇబ్బంది కలగకుండా నాలుగు రోజులు మాత్రమే పనిచేసే విధంగా షెడ్యూల్ ని మార్చారని తెలిపింది. కేవలం ఒక హీరోయిన్ కోసం నాగార్జున లాంటి సీనియర్ హీరోలు అలా చేయడం ఆయన గొప్పతనం అంటూ తెలియజేసింది. గత కొంతకాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈమె మలయాళం సినిమాతో మాత్రమే బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.

Share post:

Latest