కూతురుపై రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ వైరల్.. ఆమె లేచిపోయిందంటూ వ్యాఖ్యలు..

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పడం కష్టం. సామాన్యులైనా, సెలబ్రెటీలు అయినా ప్రేమలో పడితే మరో లోకంలో విహరిస్తారు. తాము ప్రేమించిన వ్యక్తి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ఇంట్లో తల్లిదండ్రులను ఎదిరించి, ప్రేమించిన వ్యక్తులను వివాహం చేసుకుంటారు. అయితే యువతీ యువకులు చేసే ఈ పనితో వారి తల్లిదండ్రులు మనసు గాయపడుతుంది. తమకు మనవళ్లు లేదా మనవరాళ్లు పుట్టిన తర్వాత పిల్లలతో తల్లిదండ్రులు కలుస్తారు.

అయితే కొందరు మాత్రం చచ్చే వరకూ తమ పిల్లలతో మాట్లాడబోమని భీష్మిస్తారు. ఇదే కోవలో తెలుగు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఉంటారు. ఆయన కుమార్తె ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి తన కుమార్తెతో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడడం మానేశారు. తాజాగా ఆమె గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఎన్నో హాస్యభరిత చిత్రాల్లో రాజేంద్ర ప్రసాద్ నటించారు. చక్కని హాస్యాన్ని పంచడంతో పాటు సందేశాన్నిచ్చేవిగా ఆయన సినిమాలు ఉండేవి. వయసు పై బడిన తర్వాత ఆయన పలు సినిమాలలో కీలక పాత్రల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. రోజుకు ఆయన రూ.3లక్షలు తీసుకుంటాడనే టాక్ సినీ వర్గాల్లో ఉంది. ఇక మహానటి సినిమాలో సావిత్రి చిన్నప్పటి పాత్రలో నటించింది ఆయన మనువరాలే. ఆ సినిమా ఫంక్షన్‌లో తొలిసారి ఆయన తన కుమార్తె గురించి చెప్పారు. తన కుమార్తె లేచిపోయి పెళ్లి చేసుకుందని, అందుకే ఆమెతో తాను ఇప్పటి వరకు మాట్లాడలేదని చెప్పారు.

ఇదే వ్యాఖ్యలను తాజాగా మరో వేదికపైనా ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి వ్యక్తి తన కుమార్తెలో తల్లిని చూసుకుంటాడని, తాను కూడా తన కుమార్తెలో తల్లిని చూసుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే తన అభీష్టానికి వ్యతిరేకంగా ఆమె ప్రేమ పెళ్లి చేసుకోవడంతో మాట్లాడడం లేదని పేర్కొన్నారు.

Share post:

Latest