అందుకే బీర్ తాగానంటున్న హీరోయిన్ ఆమని..!!

మూడు దశాబ్దాల క్రితం విడుదలైన జంబలకడిపంబ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైంది హీరోయిన్ ఆమని. ఇక ఈ సినిమాని ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆడవాళ్లు పనులు మగవారు మగవాళ్ళ పనులు ఆడవాళ్లు చేస్తే ఎలా ఉంటుందో చూపించడంతో పాటు ప్రతి ఒక్కరిని కడుపుబ్బ నవ్వించారు. ఇందులో హీరోయిన్గా నటించిన ఆమని తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.

Guess What Your Favorite 90's Heroines Are Upto! | JFW Just for women

సినిమాలో మద్యం తీసుకునే సన్నివేశాలు.. సిగరెట్ కాల్చే సీన్స్ ఉన్నాయని డైరెక్టర్ ముందు చెప్పలేదట .రోజులాగే షూటింగ్ లోకేషన్ కి వెళ్లాను మద్యం సీన్ గురించి చెప్పారు.దానికి నేను ఓకే అన్న అయితే ఇదంతా నాకు కొత్త బాటిల్ లో కూల్డ్రింక్ వేసి ఇస్తారేమో అనుకున్నాను కానీ రియల్ బీర్ ఇచ్చారు.. కానీ బాటిల్ ఓపెన్ చేయగానే బయటకు నురుగు పొంగుతోంది.. ఇదేంటని అడగగా దానికి వాళ్లు బీర్ అని చెప్పారట.. ఇందులో నువ్వు ఒక సీన్ చేయాలని ఒక షార్ట్ అన్నారని డైరెక్టర్ చెప్పారట .అప్పుడు హీరో నరేష్ కూడా ఏం కాదమ్మా తాగు అని ప్రోత్సహించారని తెలిపింది.

దీంతో తప్పని పరిస్థితుల్లో బీరు రుచి చూడవలసి వచ్చిందని తెలిపింది.అప్పుడంటే ఇవన్నీ కొత్త ఇప్పుడు ఏ సినిమా చేసిన మద్యం సిగరెట్ తాగని సన్నివేశం అసలు లేదని తెలిపారు. ఇప్పటి సినిమాల చాలా కామన్ సన్నివేశాలలో ఇవన్నీ కనిపిస్తున్నాయని తెలుపుతోంది. ఇక ఈ మధ్యకాలంలో నిత్యమీనన్ వైన్ షాపుకెళ్లి బీరు బాటిల్స్ కొన్న సన్నివేశాలు సినిమాల్లో హైలెట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఆమని చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

Share post:

Latest