శివ‌రాత్రికి టాప్ లేపేసిన `టెంప‌ర్‌`.. ఎన్టీఆర్ ఖాతాలో న‌యా రికార్డ్‌!

టెంప‌ర్‌.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఎప్ప‌టికీ గుర్తిండి పోయే చిత్రాల్లో ఒక‌టి. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టించింది. ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, కోట శ్రీనివాస రావు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోసించారు. వక్కంతం వంశీ ఈ మూవీకి క‌థ అందించ‌గా.. అనూప్‌ రుబెన్స్ పాటు, మణి శర్మ బ్యాక్‌గ్రైండ్ మ్యూజిక్ అందించారు.

2015 ఫిబ్రవరి 13న విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. బృందావనం త‌ర్వాత స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న ఎన్టీఆర్ కు `టెంప‌ర్‌` మూవీ మంచి బూస్ట్ ఇచ్చింది. ఈ సినిమాతోనే సూప‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకుని మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చాయి. టెంప‌ర్ అనంత‌రం బ్రేకుల్లేని హిట్స్ తో ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ ఖాతాలో ఓ న‌యా రికార్డ్ వ‌చ్చింది ప‌డింది.

శివరాత్రి సందర్భంగా చాలా మంది జాగారం ఉంటారు. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్ లో టెంపర్ సినిమాని ప్రత్యేకంగా ప్ర‌ద‌ర్శించారు. అయితే రీ రిలీజ్ లో టెంప‌ర్ టాప్ లేపేసింది. శివరాత్రి నాడు టెంపర్ మూవీని నైట్ మొత్తం మూడు షోలు వేయ‌గా.. అక్ష‌రాల రూ. 3.95 లక్షలు కలెక్ట్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఒకే రాత్రిలో ఇంత పెద్ద మొత్తంలో కలెక్ట్ చేయడం నిజంగా రికార్డ్ అని చెప్పాలి.

Share post:

Latest