తార‌క‌ర‌త్న‌తో దిగిన ఆఖ‌రి పిక్‌ షేర్ చేసిన అలేఖ్య‌.. కన్నీరు పెట్టిస్తున్న తాజా పోస్ట్‌!

నంద‌మూరి తార‌క‌రత్న ఈ నెల 18వ తేదీన క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. 39 ఏళ్ల వ‌య‌సులోనే తార‌క‌ర‌త్న త‌నువు చాలించ‌డంతో నంద‌మూరి కుటుంబ‌స‌భ్య‌లు, అభిమానుల వేద‌న వ‌ర్ణనాతీతంగా మారింది. మ‌రోవైపు తార‌క‌ర‌త్న ఇక లేడు, తిరిగిరాడు అన్న విష‌యాన్ని ఆయ‌న భార్య అలేఖ్య రెడ్డి ఏ మాత్రం జీర్ణించుకోలేక‌పోతున్నారు.

భ‌ర్త అంత్యక్రియల సమయంలో అలేఖ్య రెడ్డిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. అలాగే తారకరత్న చిన్న కర్మ లో కూడా తన భర్త లేరనే చేదువార్తను దిగమింగలేక అలేఖ్య రెడ్డి క‌న్నీరు మున్నీరు అయిపోయింది. ఇక తారకరత్న మరణించడంతో ఒంటరిగా మిగిలిపోయిన అలేఖ్య రెడ్డి.. తన భర్తతో ఉన్నటువంటి జ్ఞాపకాలను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.

ఇందులో భాగంగానే తాజాగా అలేఖ్య రెడ్డి పెట్టిన తాజా పోస్ట్ అంద‌రి చేత క‌న్నీరు పెట్టేస్తోంది. తారకరత్నతో చివరగా దిగిన పిక్ ను అలేఖ్య సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. `ఇదే మా చివరి ఫోటో అని తలుచుకుంటుంటే నా హృద‌యం బద్దలవుతోంది. ఇదంతా కల అయితే బాగుంటుంది. నీ వాయిస్ తో అమ్మ బంగారు అంటూ లేపవా ` అంటూ ఎమోష‌న‌ల్ కామెంట్స్ చేసింది. చివరగా తిరుమలకి వెళ్ళినప్పుడు ఆలయం వద్ద తారక రత్న, అలేఖ్య రెడ్డి తమ ముగ్గురు పిల్లలతో ఫోటో దిగారు. ఈ పిక్ నే అలేఖ్య సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

https://www.instagram.com/p/CpKyEcDqhgM/?utm_source=ig_web_copy_link

Share post:

Latest