విజ‌య్ వ‌ర్మ‌తో ల‌వ్ ఎఫైర్‌.. ఒక్క పోస్ట్ తో క్లారిటీ ఇచ్చేసిన‌ మిల్కీ బ్యూటీ!

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో మిల్కీ బ్యూటీ తమన్నా ప్రేమలో ఉందంటూ గ‌త కొద్ది రోజుల నుంచి జోరుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకలో విజయ్ వర్మ, తమన్నా లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్‌ చేసింది. అప్పటినుంచి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు మొదలయ్యాయి. కానీ ఇంతవరకు ఈ వార్తలపై విజయ్ వర్మ, తమన్నా స్పందించలేదు అలాగే ఖండించనూ లేదు.

పైగా పలుమార్లు ఇద్దరు జంటగా మీడియా కంటపడడంతో నెట్టింట జరుగుతున్న ప్రచారం నిజమే అని చాలామంది భావిస్తున్నారు. తాజాగా తమన్నా విజయ్ వర్మతో పరోక్షంగా ప్రేమలో ఉన్నానని ఒక్క పోస్ట్ తో క్లారిటీ ఇచ్చేసింది. అసలు ఏం జరిగిందంటే.. విజ‌య్ వ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన `ద‌హాడ్` వెబ్‌ సిరీస్ బెర్లిన్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో స్క్రీనింగ్ అయ్యింది.

ఈ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు విజ‌య్ వ‌ర్మ‌, సోనాక్షి సిన్హాతో పాటు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు రీమా క‌గ్తి, జోయా అక్త‌ర్ హాజ‌ర‌య్యాడు. ఈ సిరీస్‌కు ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో మంచి రెస్పాన్స్ వ‌చ్చిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో విజ‌య్‌ పోస్ట్ పెట్టాడు. అయితే అత‌డి పోస్ట్‌ను త‌మ‌న్నా త‌న ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. ప్రియుడు విజ‌య్ కు మ‌రియు మిగ‌తా టీమ్ కు త‌మ‌న్నా ప్ర‌త్యేకంగా విషెస్ తెలిపింది. దీంతో విజ‌య్ వ‌ర్మ‌తో త‌మ‌న్నా ల‌వ్ ఎఫైర్ నిజ‌మే అంటూ బీటౌన్ లో వార్త‌లు ఊపందుకున్నాయి.

Share post:

Latest