శ్రీలీల సినిమాల లైనప్ చూసి షాక్ అవుతున్న స్టార్ హీరోయిన్లు..!

దర్శక దిగ్గజం రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ‘పెళ్లి సందడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి శ్రీలీల. ఇటీవలే రవితేజ లాంటి పెద్ద హీరోతో ‘ధమాకా’ సినిమాలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది శ్రీలీల. ఈ సినిమాలో శ్రీలీల డ్యాన్స్ స్టెప్పులు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దాంతో ఈ ఏడాది ఈ అమ్మడు చేతిలో ఏకంగా 8 సినిమాలు వచ్చి చేరాయి. అవి కూడా బడా హీరోలతో కలిసి నటించే ఛాన్సులు కావడం విశేషం.

ఇప్పుడు ఈ అందాల బొమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో నటిస్తోంది. ఇక ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న SSMB28 లో సెకండ్ లీడ్ గా నటిస్తుంది. బాలయ్య కుమార్తెగా శ్రీలీల NBK108 లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా బోయపాటి శ్రీను దర్శకత్వం లో రామ్ పోతినేని సరసన నటించనుంది. నితిన్ 32, నవీన్ పోలిశెట్టి డైరెక్షన్ లో అనగనగా ఒక రాజు, వైష్ణవ్ తేజ్ తో కలిసి PVT04, జూనియర్ లాంటి సినిమాలు ఈ ఏడాది శ్రీలీల అకౌంట్ లో ఉన్నాయి.

ఒకప్పుడు టాప్ హీరోయిన్స్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న పూజ హెగ్డే, రష్మిక లాంటి వాళ్ళు కూడా వరుస సినిమాలతో దూసుకెళ్లిపోయారు. కానీ ఇప్పుడు వారి చేతిలో శ్రీ లీలా చేతిలో ఉన్నన్ని అవకాశాలైతే లేవు. దానికి తోడు ఈ కుర్ర మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి టాప్ హీరోలతో నటించబోతుందని తెలిసి ఇతర హీరోయిన్లు షాక్ అవుతున్నారట. శ్రీ లీల నక్కతోక తొక్కిందని కామెంట్లు చేస్తున్నారట. శ్రీ లీలను చాలా గ్లామరస్ గా చూపించి అందరి డైరెక్టర్ల దృష్టిలో పడేలా చేసిన రాఘవేంద్రరావుకే ఈ క్రెడిట్ అంతా అని సినీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ అమ్మడు అదృష్టం మామూలుగా లేదు.

Share post:

Latest