జబర్దస్త్ యాంకర్‌గా ఆఫర్ అలా వచ్చిందని చెప్పిన సౌమ్య రావు..!

 

ఈటీవీ సీరియల్స్ లో కనిపించినప్పటికీ పెద్దగా పాపులర్ అవ్వని సౌమ్య రావు జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయింది. అయితే ఈ అమ్మడు జబర్దస్త్ లో ఒక్క ఎపిసోడ్‌కి రూ.80,000 వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం. జబర్దస్త్ షో వల్ల పాపులర్ అయిన సౌమ్య వేరే షోస్ లో కూడా యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ షోలో ఈమె వేసే జోకులు, పంచులు బాగుంటాయని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. జాగాయి ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర విషయాలు పంచుకుంది

“జబర్దస్త్ లో యాంకరింగ్ చేస్తారా? అని కాల్ వచ్చినప్పుడు.. ఎవరో నన్ను ఆటపట్టించడానికి కాల్ చేసారు అని అనుకున్నాను. కానీ మల్లెమాల వాళ్లే నిజంగా చేస్తారనుకోలేదు. తర్వాత నిజం తెలిసి చాలా సంతోషపడ్డా. వాళ్ళు కాల్ చేసినప్పుడు నాకు తెలుగు రాదు అని చెప్తే, నా తెలుగు క్యూట్ గా ఉంటుందని అందుకే నన్ను ఆడిషన్స్ కి రమ్మని వాళ్ళు అన్నారు” అని ఆమె తెలిపింది. ఆడిషన్స్ కి వెళ్లినప్పుడు నాలుగు రకాల కాస్టుమ్స్ లో ఆమెని టెస్ట్ చేసారట. అలానే కెమెరాల ముందు నవ్వమని అడిగితే ఆమె నవ్విందట. ఇక ఆ విధంగా ఆమెకి జబర్దస్త్ లో అవకాశం వచ్చిందని పేర్కొన్నారు.

ఇక జబర్దస్త్ యాంకర్స్ రష్మి గౌతమ్, అనసూయాలు డాన్స్ బాగా చేస్తారని కానీ ఆమెకి డాన్స్ చేయడం సరిగా రాదని సౌమ్య పేర్కొంది. ప్రస్తుతం సౌమ్య డాన్స్ నేర్చుకుంటుందట. త్వరలోనే జబర్దస్త్ స్టేజ్ పై మంచి డాన్స్ పెర్ఫార్మన్స్ ఇస్తానని సౌమ్య కామెంట్స్ చేసారు.

Share post:

Latest