ఆమెది గోల్డెన్ లెగ్గు.. వెంటపడుతున్న స్టార్ డైరెక్టర్లు??

పవన్ కళ్యాణ్ సరసన భీమ్లా నాయక్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి సంయుక్త మినన్. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా డీసెంట్‌గా ఉంటుంది. భీమ్లా నాయక్ సినిమా సూపర్ హిట్ కాకపోయినప్పటికీ మంచి టాక్ అయితే సంపాదించుకుంది. ఆ తరువాత సంయుక్త నటించిన సినిమా బింబిసార. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. బింబిసార సినిమాలో నటించిన ఇంకో హీరోయిన్ కేతరిన్ కంటే సంయుక్తకే మంచి పాత్ర వచ్చింది.

ఇక ఇటీవలే సంయుక్త, ధనుష్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సార్’ సినిమా కూడా బ్లాక్‌ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో మీనాక్షి అనే టీచర్ పాత్రలో నటించి ప్రేక్షకులకు అల్లరించింది సంయుక్త. సార్ సినిమా హిట్ అయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కూడా ఆమె రాకను చూసి ప్రేక్షకులు కేకలతో, ప్రశంసలతో ఆమెని ముంచేత్తారు. సంయుక్త తన నటనతో, అందంతో మన తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలు అన్ని మంచి విజయాన్ని అందుకున్నాయి. దాంతో తెలుగు ఇండస్ట్రీ సంయుక్త ని గోల్డెన్ లెగ్ అని పిలుస్తూ స్టార్ డైరెక్టర్స్ ఆమె వెంట పడుతున్నారు. మరి ఈ ముద్దుగుమ్మ తనకి వస్తున్న డిమాండ్ ను వాడుకుంటుందో లేదో చూడాలి.

ఇకపోతే సంయుక్త 2016లో మలయాళం చిత్రం పాప్‌కార్న్‌తో సినీ రంగ ప్రవేశం చేసింది. 2018లో మలయాళ రివెంజ్ థ్రిల్లర్ లిల్లీలో టైటిల్ రోల్ పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ కేరళ కుట్టి 2021 వరకు మలయాళ సినిమా పరిశ్రమకు మాత్రమే అంటూ పెట్టుకుంది తర్వాత తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. ఆపై భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

Share post:

Latest