జపాన్‌లో ఆర్ఆర్ఆర్ అరుదైన ఘనత.. ఆ విశేషాలు ఇవే!

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఆస్కార్ అవార్డు బరిలో దూసుకెళ్తుంది. అయితే జపాన్‌లో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. పాన్ ఇండియా పరంగా రికార్డు కలెక్టన్స్ సృష్టించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇప్పుడు జపాన్ లో బీభత్సం సృష్టిస్తోంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ముత్తు సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ ఆర్ ఆర్ ఆర్ సినిమా జపాన్ లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తాజాగా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం, రాజమౌళి రూపొందించిన మాస్టర్ పీస్ ఆర్ ఆర్ ఆర్ సినిమా జపాన్‌లో JPY 1 బిలియన్ మార్కును దాటిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది. అంటే రూ.62 కోట్లు అని అర్థం.

ఆర్ ఆర్ ఆర్ సినిమా ఒక బిలియన్ మార్కును క్రాస్ చేసిన సందర్బంగా జపాన్‌లో ఒక బిలియన్ డాలర్ల జపనీస్ యెన్‌ను వసూలు చేసిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ సినిమా నిలిచింది. ఈ భారీ బడ్జెట్ అద్భుతమైన సినిమాలో అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగన్ లాంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా కోసం జపాన్ లో ఎస్ఎస్ రాజమౌళి, రామ్ చరణ్, తారక్ ఎక్కువగా ప్రచారాలు చేసారు.

గత సంవత్సరం అక్టోబర్‌లో విడుదలైన, RRR జపాన్‌లో నెలరోజుల పాటు బాక్సాఫీస్ వద్ద నిలకడగా డబ్బులు వసూలు చేసింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, గత నాలుగు వారాలలో ఈ మూవీ కలెక్షన్లు రెట్టింపు అయ్యాయి.

Share post:

Latest