పచ్చిగా మాట్లాడిన రష్మీ.. ఇలాంటి మాటలు కూడా మాట్లాడతారా అంటూ షాక్..?

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షోలో యాంకరింగ్ చేస్తూ అపుడప్పుడు స్కిట్స్‌లో తనదైన శైలిలో పంచులు వేస్తూ అందరినీ నవ్విస్తుంటుంది రష్మీ. జబర్దస్త్ ఆమెకి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. బుల్లి తెరపై యాంకరింగ్ చేస్తూనే అప్పుడప్పుడు సినిమాలలో కూడా నటిస్తుంది. అయితే వెండి తెరపై మాత్రం ఈ అమ్మడుకి పెద్దగా అదృష్టం కలిసిరావడం లేదనే చెప్పుకోవాలి. కానీ బుల్లితెర యాంకర్ గా మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది.

రష్మీ తనపై వచ్చే నెగిటివ్ కామెంట్స్ ని పెద్ద పట్టించుకోదు. అంతేకాకుండా గొడవలకి చాలా దూరంగా ఉంటుంది. అందుకే రష్మీకి ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే జబర్దస్త్‌ లో కమెడియన్స్ ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడుతుంటారు. అయిన రష్మీ వాటిని పట్టించుకోదు. చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ షో చూస్తుంటారు కాబట్టి రష్మీ చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది.

అయితే ఈ సారి మాత్రం రష్మీ టంగ్ స్లిప్ అయ్యి వివాదలను ఎదుర్కొంటుంది. తాజాగా జబర్దస్త్ లో జరిగిన ఒక ఎపిసోడ్‌లో భార్య పాత్ర మాట్లాడుతూ “పిల్లలు పుట్టాలంటే భార్య భర్తలు ఇలా కంచం దగ్గర కూర్చుంటే కుదరదు.” అంటారు. తరువాత భర్త పాత్ర మాట్లాడబోతుంటే రష్మీ కల్పించుకొని ” మంచానికి దగ్గరగా ఉండాలి” అని అంటుంది. దాంతో అక్కడ ఉన్నవాళ్ళంతా గట్టిగా కేకలు వేస్తూ అరుస్తారు. అసలు రష్మీ అలా పచ్చిగా మాట్లాడం చూసి ఏంటి ఇలా మాట్లాడింది రష్మీ అని స్టూడియోలో ఉన్న వారితో సహాయం బయట వారు షాక్ అవుతారు.

Share post:

Latest