హీరోగా మారిన రావు రమేష్.. ప్రేక్షకుడికి టార్చర్‌యే??

 

ప్రస్తుతం జనాలు సినిమాలో రొటీన్ కథలను ఇష్టపడడం లేదు. ఎక్కువగా కొత్తదనం కోరుకుంటున్నారు. ఏదైనా మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా అయితేనే ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్తున్నారు. అయితే ఉన్న హీరోలు సరిపోనట్లు ఇప్పుడు సీనియర్ ఆర్టిస్ట్‌లు హీరోలుగా మారుతున్నారు. సీనియర్ నటుడిగా చాలా సినిమాలలో తండ్రి, విలన్, మామ లాంటి పాత్రలు పోషించిన రావు రమేష్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

 

“మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం” అనే సినిమాలో రావు రమేష్ హీరోగా నటించనున్నారు. లక్ష్మణ్ కార్య ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కంటెంట్ డ్రివన్ కథతో కొనసాగే ఈ సినిమా లో ఇంద్రజ హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే ఈ ముసలి వాళ్ళ సినిమా ఎవరు చూస్తారని చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రేక్షకులకు టార్చరే అని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇకపోతే బాలీవుడ్ నటులు నవాజుద్దిన్ సిద్ధిఖి, రాజకుమార్ రావ్ లాంటి సీనియర్ నటులు పోషించిన పాత్ర తరహాలోనే రావు రమేష్ పాత్ర కూడా ఉంటుంది. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహిస్తున్న మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా కథ ప్రేక్షకులు కోరుకుంటున్న విధంగా సరికొత్తగా ఉండబోతుందట. ఇక ఈరోజే మేకర్స్ ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఇక ఈ సినిమాని పీబీఆర్ సినిమాస్‌ వారు నిర్మిస్తున్నారు.