క్యారెక్టర్ డిమాండ్ చేస్తే అది తీసేయడానికి కూడా రెడీ.. రాశిఖన్నా బోల్డ్ కామెంట్స్!

 

ప్రముఖ నటి రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘ ఊహలు గుసగుసలాడే ‘ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ ముద్దు గుమ్మ. ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఇటీవలే హిందీ సినిమా’ ఫర్జీ ‘ లో నటించింది. రాజ్, డికె లు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, షాహీద్ కపూర్ కీలక పాత్రలో నటించారు.

కాగా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి పదేళ్లు అవుతున్న సందర్భంగా రాశి ఖన్నా తన కెరీర్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ బబ్లీ గర్ల్ మాట్లాడుతూ “నేను ఇండస్ట్రీ లోకి వచ్చి అప్పుడే పది సంవత్సరాలు పూర్తి అవుతున్నాయని తెలిసాక చాలా ఆశ్చర్యపోయా. పది సంవత్సరాలు అయినప్పటికీ నేను నటనలో కొత్త విషయాలు నేర్చుకుంటూ విద్యార్థిగా నన్ను నేను మెరుగుపరుచుకుంటున్నాను. ఇండస్ట్రీలో నాదొక అందమైన ప్రయాణం ” అని చెప్పింది. ‘ఏ పాత్రలో అయిన ఇట్టే ఒదిగిపోయేలా నటిస్తేనే నటీనటులకు మంచి పాత్రలు వస్తాయి. నేను నటించిన మొదటి సినిమా ఊహలు గుసగుసలాడే తరువాత చాలా గ్లామర్ పండించే సినిమాలోనే నటించాను. చాలా సినిమాల కోసం ఆడిషన్స్ ఇచ్చాను. తొలిప్రేమలో నా వీడియో చూసి ఫర్జీ లో డీకే, రాజ్ నన్ను సెలెక్ట్ చేసారు.” అని చెప్పింది.

ఇక రాశి తన మేకప్ వాడకం గురించి వివరిస్తూ ‘ఒక క్యారెక్టర్‌కి 100% న్యాయం చేయడానికి నేను మేకప్ తీసేయడానికి కూడా రెడీ. ఎందుకంటే నటులుగా ఒక పాత్రను నిజాయితీగా చూపించడం మా ధర్మం’ అని చెప్పింది. నిజానికి హీరోయిన్లు మేకప్ తీసేస్తే మామూలుగా ఉన్న అమ్మాయిల కంటే అంద విహీనంగా ఉంటారు. కానీ కొందరు మాత్రం నాచురల్ బ్యూటీతో చాలా అట్రాక్టివ్ గా ఉంటారు. అలాంటి కొద్ది మందిలో రాసి ఒకటి. అందుకే బోల్డ్‌గా తాను మేకప్ తీసేయడానికి కూడా రెడీ అని చెబుతోంది.

Share post:

Latest